60 ప్లస్ లో ఈ తిప్పలు ఎవరికోసం.. స్టార్ హీరోల రచ్చ..

హీరో అంటే ఏ సాహసమైనా చేయాలి.. అందుకే మన తెలుగు సినిమా హీరోలు ఆంజనేయుడు తమ్ముడులా ఏమైనా చేస్తారు. వాళ్లు ఏం చేసినా ప్రేక్షకులు కూడా ఓకే అనేస్తారు. అయితే పరిస్థితులు మాత్రం ఒకప్పటిలా లేవు. ఆప్పట్లా ఇప్పుడు డూప్ లను పెట్టుకుని లాగించేస్తామంటే కుదరదు. ఎందుకంటే కాలం మారిపోయింది.. ట్రెండ్ కు తగ్గట్లు మనం కూడా మారాలి కాబట్టి. అయితే ఇప్పుడు కొందరు సీనియర్ హీరోలు మాత్రం భారీ సాహసాలు చేస్తున్నారు. కావాలంటే ఇప్పుడు చిరంజీవినే తీసుకోండి.. ఈయన ప్రస్తుతం కొరటాల శివ సినిమాలో నటిస్తున్నాడు. దీనికి ముందు సైరా నరసింహారెడ్డిలో నటించాడు. ఈయన కలల ప్రాజెక్ట్ ఇది.
64 ఏళ్ళ వయసులో ఈ సినిమా కోసం 246 రోజులు కష్టపడ్డాడు మెగాస్టార్ చిరంజీవి. ఇవన్నీ ఈ ఏజ్ లో చిరు చేయగలడా..? ఒకవేళ చేసినా అభిమానుల్ని సంతృప్తి పరచగలడా..? యుద్ధ సన్నివేశాల్లో పర్ ఫెక్షన్ చూపించగలడా..? అనే ప్రశ్నలకు తెరదించుతూ సైరాలో అద్భుతంగా యాక్షన్ సన్నివేశాలు చేశాడు చిరంజీవి. ఇప్పుడు కొరటాల కోసం కూడా చాలా కష్టపడుతున్నాడు. ఇదే టైమ్ లో బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ లాంటి హీరోలు తమ ఏజ్ కు తగ్గట్లు హూందా అయిన పాత్రల్లో నటిస్తున్నారు. కానీ మన దగ్గరే యాక్షన్ యాక్షన్ అంటూ 60 ప్లస్ లోనూ సాహసాలు చేయడానికి రెడీ అవుతున్నారు.
ఆ మధ్య లింగా.. కబాలి లాంటి సినిమాల్లో రజినీకాంత్ ఏజ్ కు మించిన పాత్రలు చేసాడేమో అనిపించింది. ఇక 3డి సినిమా కొచ్చాడయాన్ లోనూ రజినీ చేసిన సాహసాలు నవ్వు తెప్పించాయి. 60 దాటిన తర్వాత వీళ్ళు చేస్తోన్న ఈ యాక్షన్ సీక్వెన్సులు కాస్త కామెడీగానే అనిపిస్తున్నాయి. కుర్ర హీరోలు చేయాల్సిన పాత్రల్లోనూ తమను ఊహించుకుంటూ.. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయట్లేదేమో అనే వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి లాంటి సినిమాలో అంతా కుర్రాళ్లే పనిచేసారు. అందుకే ఆ సినిమాలో యాక్షన్ పార్ట్ అదిరిపోయింది. మరి అదే స్థాయిలో ఇప్పుడు సైరా నరసింహారెడ్డి ఉండబోతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. 60 ప్లస్ లో చిరు ఎలాంటి సాసహాలు చేయబోతున్నాడు..? ఒకవేళ చేసినా అవి యాప్ట్ గా అనిపిస్తాయా..? ఆ పాత్ర కోసం మెగాస్టార్ ఎలా మారిపోతాడు..? ఇవన్నీ రేపు సినిమా విడుదలైన తర్వాత తెలుస్తుంది.