English   

అర్హత లేని హీరోలకు ఆరాటం ఎందుకు.. 60 ప్లస్ అని మరిచారా..

 Tollywood
2020-06-11 07:24:09

ఎప్పుడెప్పుడు సినిమా షూటింగ్ మొదలు పెడదామా.. ఎప్పుడెప్పుడు అనుమతులు ఇస్తారా అని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చుట్టూ మన సీనియర్ హీరోలతో పాటు కొందరు దర్శక నిర్మాతలు తిరుగుతున్నారు. ఇప్పటికే బాలకృష్ణ దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక వైపు కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో సినిమా షూటింగులు చేసుకోవడానికి అనుమతి ఎలా ఇస్తారు అంటూ బాలయ్య ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ ఎవరి స్వార్థం వాళ్లు చూసుకుంటున్నారు.. తమ సినిమా మొదలైతే చాలు అనే స్వార్థం అందరిలోనూ కనిపిస్తుంది అంటూ బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒకవిధంగా ఆలోచిస్తే ఈయన చెప్పింది కూడా రైట్ అనిపిస్తుంది. ఎందుకంటే కరోనా వైరస్ ప్రస్తుతం దేశంలో దారుణంగా విజృంభిస్తోంది. ఒక్క రోజు దాదాపు 10 వేల పాజిటివ్ కేసులు వస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మరీ ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వాళ్ళు.. పదేళ్లలోపు పిల్లలు ఈ వైరస్ బారిన పడితే కోలుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన హీరోలు వయసు మర్చిపోయినట్లున్నారు. చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ వయసు ఇప్పుడు 60 ఏళ్లకు పైనే. అందులో చిరంజీవికి 64 సంవత్సరాలు. సినిమా షూటింగ్ చేయడానికి ఈయనకు అర్హత లేదు. నాగార్జున వెంకటేష్ కు కూడా ఈ అర్హత లేదు. ఇలాంటి సమయంలో షూటింగ్స్ అనుమతుల కోసం ఎందుకు అంతగా వెంపర్లాడుతున్నారు అంటూ కొందరు నేరుగానే ప్రశ్నిస్తున్నారు.

నిజంగానే షూటింగ్ పర్మిషన్ కోసం వెళ్తున్నారా లేదంటే లోపల ఏదైనా బిజినెస్ డీల్ మాట్లాడుకుంటున్నారా అంటూ ఇండస్ట్రీలోని కొందరు ప్రశ్నిస్తున్నారు. covid 19 నియమ నిబంధనల ప్రకారం 60 ఏళ్లు పైబడిన వాళ్లు అసలు ఇంటి నుంచి బయటకు రాకూడదు. కానీ మన హీరోలు మాత్రం భుజానికి తగిలించుకొని హాయిగా తిరిగేస్తున్నారు. మరి వాళ్ళు ఈ నియమంలోకి రారా అంటూ కొందరు అడుగుతున్నారు. ఏదేమైనా కూడా అర్హత ఉన్న కుర్ర హీరోలు మాత్రం తమ పని తాము చేసుకుంటూ ఉంటే 60 ఏళ్లు పైబడిన హీరోలు మాత్రం అనుమతుల కోసం అటూ ఇటూ తిరుగుతున్నారు. కొందరు హీరోలు మాత్రం ఆగస్టు వరకు తాము షూటింగ్ కు వచ్చే సమస్యే లేదని దర్శక నిర్మాతలకు తెగేసి చెబుతున్నారు. 

More Related Stories