English   

చిరంజీవి వేదాళం రీమేక్‌కు 60కోట్ల రెమ్యునరేషన్

Chiranjeevi
2020-12-17 19:08:45

టాలీవుడ్‌లో తిరుగులేని హీరోగా ఉన్న చిరంజీవి ఎంత రెమ్యునరేషన్ అడిగినా ఇచ్చేందుకు నిర్మాతలు సై అంటున్నారు. ‘ఆచార్య’ కోసం ఆయన ఏకంగా రూ.50కోట్లు తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఇందులో ఆయన తనయుడు రామ్‌చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. నిరంజన్‌రెడ్డితో కలిసి చరణ్‌ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.‘ఆచార్య’ పూర్తికాగానే చిరు ‘వేదాళం’ రీమేక్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. సంక్రాంతి తర్వాత సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని దర్శకుడు మెహర్ రమేష్‌కి చెప్పారట. తమిళంలో అజిత్ నటించిన ‘వేదాళం’ అక్కడ సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగినట్లుగా మెహర్ రమేష్ అనేక మార్పులు చేశారట. తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం చిరంజీవి ఈ సినిమా కోసం ఏకంగా రూ.60కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఈ రీమేక్‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్న అనిల్ సుంకర కూడా చిరంజీవి రూ.60కోట్లు అడిగితే కాదనకుండా ఒప్పేసుకున్నారంట. 

More Related Stories