English   

600 మందితో అక్క‌డ ధ‌ర్నా చేస్తున్న బాల‌కృష్ణ‌.. 

NTR-Mahanayakudu
2019-01-23 04:54:32

ఎన్టీఆర్ కథానాయకుడు ఊహించిన విధంగా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు మహానాయకుడు సినిమాతో ఎలాగైనా విజయం అందుకోవాలని కసితో కనిపిస్తున్నాడు బాలకృష్ణ. ప్రస్తుతం మహానాయకుడు సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు ఈ హీరో. ఈ చిత్రంలో 90 శాతం ఇదివరకే పూర్తయిపోయింది. కేవలం పది రోజులు షూటింగ్ మాత్రమే బాకీ ఉంది. ఇప్పుడు దీన్ని కూడా పూర్తి చేశారు బాలకృష్ణ, క్రిష్. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఏపిపిఏ గ్రౌండ్స్ లో ధర్నా సీన్స్ తెరకెక్కిస్తున్నారు క్రిష్. ఇందులో ఎన్టీఆర్ పాత్ర వేసిన బాలకృష్ణతో పాటు.. హరికృష్ణ గా ఉన్న కళ్యాణ్ రామ్.. చంద్రబాబు నాయుడుగా ఉన్నా రానా కూడా కనిపిస్తున్నారు. మరో రెండు రోజుల్లో మహానాయకుడు షూటింగ్ పూర్తి కానుంది.

ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ఈ ధర్నా సన్నివేశాల్లో బాలకృష్ణతో పాటు మరో 600 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. సినిమాలో ఈ సీన్స్ బాగానే హైలెట్ అవుతుందని తెలుస్తోంది. అయితే కథానాయకుడు ఫ్లాప్ తర్వాత మహానాయకుడు సినిమాపై అంచనాలు తగ్గిపోయాయి. ఒకవేళ కథానాయకుడు హిట్ అయ్యుంటే ఇప్పుడు ఈ సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉండేవి. ఏదేమైనా ఎన్టీఆర్ రాజకీయ జీవితం ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. మరి ఈ చిత్రాన్ని క్రిష్ ఇంకెంత ఆసక్తికరంగా తెరకెక్కించి ఉంటాడో అని అభిమానులు కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఫిబ్రవరి 14 మహానాయకుడు ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Related Stories