English   

61 ఏళ్ల వ‌య‌స్సులో 90 సెక‌న్లు..కుర్ర హీరోయిన్ కు నాగ్ స‌వాల్

Nagarjuna
2021-03-31 13:24:28

కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్నసినిమా వైల్డ్ డాగ్. ఈ సినిమాలో నాగార్జున కు జోడీగా దియా మీర్జా న‌టిస్తోంది. ఈ సినిమాకు అషిషోర్‌ సాల్మన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించారు. ఏప్రిల్ ‌2న‌ ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఇక ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో చిత్ర యూన‌ట్ ఫుల్ బిజీగా ఉంది. అయితే తాజాగా నాగార్జున పుష‌ప్ వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అయితే నాగ్ ఈ వీడియో చేయ‌డానికి కార‌ణం రష్మిక ఇటీవ‌ల 30 నిమిషాల పాటు పుష‌ప్స్ చేస్తూ నాగార్జున కు ఛాలెంజ్ విసిరింది. 

అయితే ఈ ఛాలెంజ్ కు స‌మాధానం ఇస్తూ నాగార్జున వీడియోను పోస్ట్ చేసారు. నాగ్ 90 సెక‌న్ల పాటు ట్రైసిప్స్ పై ఉన్నారు. ఇక ర‌ష్మిక ఛాలెంజ్ ను స్వీక‌రించిన నాగ్ మ‌ళ్లీ ఆమెకు తిరిగి ఛాలెంజ్ విసిరారు. న‌న్ను ఓడించ‌గ‌లవా అంటూ ర‌ష్మిక‌ కు ఛాలెంజ్ చేశారు నాగ్. మ‌రి నాగ్ ఛాలెంజ్ ను ఇప్పుడు ర‌ష్మిక స్వీక‌రిస్తుందా లేదా చూడాలి. ఇదిలా ఉండ‌గా నాగ్ ప్ర‌స్తుతం నిర్మాత‌గా, హోస్ట్ గా, మ‌రియు హీరోగా ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఎంత బిజీగా ఉన్నా నాగార్జున ఫిట్ నెస్ విష‌యంలో ఎప్పుడూ కాంప్ర‌మైజ్ అవ్వ‌రు. దాంతోనే ఆయ‌న 61ఏళ్ల వ‌య‌స్సులోనూ యంగ్ గా క‌నిపిస్తున్నారు. ‌

More Related Stories