English   

63 ఏళ్ల వయసులో అందాల కిరీటం

miss
2019-11-09 06:45:40

అందాల పోటీలలో పాల్గొనాలంటే ముఖ్యంగా ప్రభావితం చేసేది వయసు. ఎందుకంటే కుర్ర వయసులో ఉన్నవారు అందంగా కనిపిస్తూ ఉంటారు. కానీ తాజాగా మిసెస్ ఇండియా తెలంగాణ 2019 కిరీటాన్ని డాక్టర్‌గా రాణిస్తూన్న 63 ఏళ్ల ఓ మహిళ కైవసం చేసుకోవడం చర్చనీయాంశం అయింది.  ఆమె నక్కాన శోభా దేవి. లండన్ లో ప్రఖ్యాత వైద్యురాలిగా శోభాదేవికి గుర్తింపు ఉంది. ఆమె రెండు దశాబ్దాల పాటు లండన్ లో వైద్య సేవలు అందించినా మాతృభూమికి ఏదైనా చేయాలన్న తపనతో భారత్ వచ్చి హైదరాబాద్ లోని లైఫ్ స్పాన్ ఆసుపత్రిలో డయాబెటాలజిస్ట్ గా పనిచేస్తున్నారు.  

వైద్య రంగంలో ఆమె చేసిన సేవలకు గాను ఆమె ఎన్నో అవార్డులు పొందారు. డాక్టర్‌గా తీరిక లేకుండా ఉన్నప్పటికీ ఫ్యాషన్‌ రంగం మీద మక్కువతో పలు అందాల పోటీల్లోనూ పాల్గొన్న ఆమె ఎట్టకేలకి మిసెస్ ఇండియా తెలంగాణ 2019 అందాల పోటీలో విజేతగా నిలిచారు. సూపర్‌ క్లాసిక్‌ విభాగంలో శోభాదేవి కిరీటం దక్కించుకున్నారు. ఈ అవార్డు దక్కడం తనకెంతో ఆనందంగా ఉందని ఆమె చెప్పారు. ఈ మేరకు ఒక ప్రముఖ పత్రిక ఓ కథనం ప్రచురించింది.

 

More Related Stories