English   

64వ‌ ఫిల్మ్ ఫేర్ అవార్డులు...ప్రేమ పక్షుల హవా !

Winners of the 64th Vimal Filmfare Awards 2019
2019-03-24 12:18:43

బాలీవుడ్‌లో 64వ‌ ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్య‌క్ర‌మం నిన్న రాత్రి ముంబైలోని జియో గార్డెన్‌ లో అట్టహాసంగా జరిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి బాలీవుడ్‌కి చెందిన సెల‌బ్రిటీలు అంద‌రు పెద్ద ఎత్తున హాజ‌రయ్యారు. అయితే హాజరయిన సెలెబ్రిటీలు అందరూ వెరైటీ డ్రెస్‌ ల‌లో హాజరవడం విశేషం. ఈ కార్య‌క్ర‌మానికి హోస్ట్‌లుగా షారూఖ్ ఖాన్, రాజ్ కుమార్ రావు, విక్కీ కౌశ‌ల్ వ్య‌వ‌హ‌రించారు. డ్యాన్స్ షోస్‌తో, ఎమోష‌న‌ల్ మూమెంట్స్‌తో ఈ కార్య‌క్ర‌మం చాలా సంద‌డిగా జ‌రిగింది. అయితే గత ఏడాది ఉత్త‌మ న‌టుడు అవార్డు సంజు చిత్రానికి గాను ర‌ణ్‌బీర్ క‌పూర్ గెలుచుకోగా, ఉత్త‌మ న‌టి అవార్డుని రాజీ చిత్రానికి గాను అలియా భ‌ట్ అందుకుంది. అలా ఇద్దరు ప్రేమికులకి చెరో అవార్డు రావడం చర్చనీయాంశం అయ్యింది. ఇక గత ఏడాది ఉత్తమ ద‌ర్శ‌కుడిగా రాజీ చిత్రానికి గాను మేఘ‌న గుల్జార్ అవార్డు అందుకున్నారు. ఉత్త‌మ చిత్రంగా రాజీ చిత్రం ఎంపిక కాగా, క్రిటిక్స్ బెస్ట్ ఫిలింగా అంద‌ధున్‌ని సెల‌క్ట్ చేశారు.
ఇక మొత్తంగా అవార్డుల విషయానికి వస్తే

ఉత్తమ చిత్రం: రాజీ
క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్: అంద‌ధున్‌
బెస్ట్ యాక్టర్ ఇన్ ఎ లీడింగ్ రోల్ (ఫిమేల్): అలియా భట్, రాజీ
బెస్ట్ యాక్టర్ ఇన్ ఎ లీడింగ్ రోల్ (మేల్): రణబీర్ కపూర్, సంజు
క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ (ఫిమేల్): నీనా గుప్తా, బాధాయి హో
క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ (మేల్): రణ్వీర్ సింగ్, పద్మవత్ మరియు ఆయుష్మాన్ ఖుర్రానా, అంధధాన్
ఉత్తమ నూతన నటి : సారా అలీ ఖాన్, కేదార్నాథ్
ఉత్తమ నూతన్ నటుడు : ఇషాన్ ఖటర్, బియాండ్ ది క్లౌడ్స్
బెస్ట్ డైరెక్టర్ : మేఘన్ గుల్జార్, రాజీ
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్: అమర్ కౌశిక్, స్త్రీ
బెస్ట్ యాక్టర్ ఇన్ ఎ సపోర్టింగ్ రోల్ (మేల్): గజ్రాజ్ రావు, బాధాయ్ హో మరియు విక్కీ కౌషల్, సంజు
బెస్ట్ యాక్టర్ ఇన్ ఎ సపోర్టింగ్ రోల్ (ఫీమేల్): సురేఖ సిక్రి, బాధాయి హో
బెస్ట్ డైలాగ్ : అక్షట్ గిల్డీ లాల్, బాధాయి హో
 

More Related Stories