English   

65లో 25.. చిరంజీవి యంగ్ లుక్ అదుర్స్..

Megastar Chiranjeevi
2020-07-23 19:23:13

చిరంజీవి మ‌ళ్లీ గెట‌ప్ మార్చేసాడు. నిన్న‌టి వ‌ర‌కు ఈయ‌న మీసాలతో క‌నిపించాడు. ఎక్క‌డికి వ‌చ్చినా కూడా ఇదే లుక్ తో క‌నిపించాడు చిరంజీవి. కానీ ఇప్పుడు కొన్ని రోజులుగా షూటింగ్ లేదు. ఆచార్య షెడ్యూల్ త‌ర్వాత ఇంటికే ప‌రిమితం అయ్యాడు చిరంజీవి. దాంతో కొత్త లుక్ లో ద‌ర్శ‌న‌మిచ్చాడు చిరు. మొన్నటికి మొన్న బ్లాక్ మాస్టర్ సినిమా చూసిన చిరంజీవి.. ఆ చిత్ర దర్శకుడు గోపి గణేష్ ను ఇంటికి పిలిచి అభినందించాడు. ఈ క్రమంలోనే మీసాలు తీసేసి ఫ్రెష్ లుక్ లో క‌నిపించాడు. ఆచార్య షూటింగ్ కు ఇంకా చాలా టైమ్ ఉంది. దాంతో అప్ప‌టి వ‌ర‌కు ఇదే లుక్ లో ఉండ‌బోతున్నాడు చిరంజీవి. ఇది కొత్త సినిమా కోసం కాదని జస్ట్ అలా కొత్తగా ట్రై చేయాలనిపించింది అంటున్నాడు చిరంజీవి. ఇప్పుడు కొత్త లుక్ లోనూ ప‌దేళ్ల కింది చిరంజీవిని గుర్తు చేస్తున్నాడు మెగాస్టార్. 

మెగా లుక్ చూసి అభిమానులు కూడా ఫిదా అయిపోయారు. 65 ఏళ్ల వ‌య‌సులోనూ 25లా మారిపోయాడు మెగాస్టార్ ఆచార్య తర్వాత కూడా వారు సినిమాల చేయబోతున్నాడు చిరంజీవి. ఇప్పటికే ముగ్గురు నలుగురు దర్శకులకు కథ సిద్ధం చేయమని చెప్పాడు. అందులో బాబీ, సుజిత్ సిద్ధంగా ఉన్నారు. మరో ముగ్గురు దర్శకులు కూడా మెగాస్టార్ కోసం స్టోరీ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నారు. షూటింగ్ లేకపోయినా.. ఇంట్లోనే ఖాళీగా ఉన్నా కూడా వర్కౌట్స్ మాత్రం ఏం చేస్తున్నాడు చిరంజీవి. వాటికి మాత్రం బ్రేక్ ఇవ్వడం లేదు. అందుకే ఇప్పటికీ అదే ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నాడు మెగాస్టార్. ఈయన చూస్తే 65 ఏళ్లు ఉన్నాయని ఎవరు అనుకోరు. ఇప్పటికీ యంగ్ హీరోలతో సమానంగా దుమ్ము దులిపేస్తున్నాడు.

More Related Stories