English   

650 కి.మీ. బైక్‌పై ఒంటరిగా వెళ్లిపోయిన స్టార్ హీరో

ajith
2020-04-22 06:32:24

సినిమాల్లో రిస్కీ స్టంట్స్‌ చేసే తమిళ హీరో అజిత్‌... రియల్‌ లైఫ్‌లోనూ సాహసం చేశాడు. హైదరాబాద్‌ నుంచి చైన్నైకి 650 కిలో మీటర్ల బైక్‌పై ప్రయాణం చేశాడు అజిత్‌. బైక్‌లో పెట్రోల్‌ పోయించుకోడానికి, ఆహారం కోసం మాత్రమే మధ్యలో ఆగినట్టు తెలుస్తోంది. అజిత్‌ నటిస్తున్న వాలిమై సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ పరిసరాల్లో జరిగింది. లాక్‌డౌన్‌కు ముందు బైక్‌పై చేజింగ్‌ సీన్స్‌ తీశారు. ఈ సీన్స్‌లో అజిత్‌ రైడ్‌ చేసిన బైక్‌ను కూడా ఈ సినిమా కోసం ప్రత్యేకంగా తయారు చేయించింది యూనిట్‌. అజిత్‌ కు బైక్ బాగా నచ్చడంతో హైదరాబాద్ నుంచి చెన్నైకి దానిపైనే వెళ్లినట్టు తెలుస్తోంది.

దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. ఈ విషయం ‘వాలిమయి’ సినిమా యూనిట్‌లో కొందరు వ్యక్తుల ద్వారా బయటకు తెలిసింది. ఇక ఈ సినిమాలో అజిత్ హీరోగా పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు. హుమా ఖురేషి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా లాక్‌డౌన్ ముగియగానే తిరిగి ప్రారంభమవుతుంది.

More Related Stories