సూపర్ హిట్ కాంబో...రవితేజ 66...క్రాక్ పుట్టిస్తాడా ?

రవితేజ ఈ మధ్య ఫామ్‌లో లేడు. రాజా ది గ్రేట్‌తో హిట్ అందుకున్నా ఆ తర్వాత ఫ్లాప్స్ పరంపర కొనసాగిస్తున్నాడు. రాజా ది గ్రేట్ హిట్ తరువాత హ్యాట్రిక్ ఫ్లాప్స్ అందుకున్న రవితేజ ప్రస్తుతం డిస్కోరాజా సినిమా చేస్తున్నాడు. అయితే ఆ సినిమా తరువాత మహాసముద్రం చేద్దాం అనుకున్న రవితేజ ఇప్పుడు ఆ సినిమా క్యాన్సిల్ కావడంతో గోపీచంద్ తో సినిమా ప్రకటించాడు.
గతంలో రవితేజకి డాన్ శ్రీను అనే మాస్ హిట్ ఇచ్చి డైరెక్టర్‌గా తన కెరీర్ స్టార్ట్ చేసిన గోపిచంద్ మలినేని ఆ తరువాత మళ్ళీ బలుపు అనే సినిమా కూడా చేశాడు. ఆ సినిమా కూడా హిట్ అయ్యింది. ఆ తరువాత భారీ బడ్జెట్‌తో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన విన్నర్ ప్లాప్ అవ్వడంతో గోపీచంద్ మలినేని సైలెంట్ అయ్యాడు. దాంతో కాస్త గ్యాప్ ఇచ్చి ఈ గ్యాప్ లో మళ్ళీ తనకు రెండు హిట్స్ ఇచ్చిన రవితేజ కోసం కథ రెడీ చేసుకుని రవితేజతో ఓకే అనిపించుకుకోగా ఆ సినిమాని ఈరోజు ప్రకటించారు.
రవితేజ పోలీస్ గా నటించిన సినిమాలన్నీ దాదాపు హిట్టే. అందులో విక్రమార్కుడు, పవర్ ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఖాకీ యూనిఫామ్ వేయబోతున్నాడు రవితేజ. ఈ చిత్రానికి `క్రాక్` అనే పేరు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.