English   

జెర్సీ మహర్షి  సినిమాలకు 67వ జాతీయ అవార్డుల పంట 

National Film Awards
2021-03-22 17:51:08

67వ జాతీయ చలన చిత్ర అవార్డులను సోమవారం ప్రకటించారు. జాతీయ ఉత్తమ నటిగా కంగనా రనౌత్(మణి కర్ణిక)‌, ఉత్తమ నటుడిగా భోంస్లే చిత్రానికి గానూ మనోజ్‌ బాజ్‌పాయ్, అసురన్‌ సినిమాకు గానూ ధనుష్‌‌లను పురస్కారాలు వరించాయి.  ఫీచర్‌ ఫిల్మ్స్‌ కేటగిరీలో ఈసారి 461, నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరీలో 220 చిత్రాలు పోటీపడ్డాయి. 

ఇక ఉత్తమ తెలుగు చిత్రంగా నాని హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కించిన ‘జెర్సీ’ ఎంపికైంది. దీంతోపాటు ఉత్తమ ఎడిటర్‌గా నవీన్‌ నూలి జాతీయ అవార్డు దక్కించుకున్నారు. మొత్తం ఐదు అవార్డులు రావడంతో తెలుగు చిత్ర పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది.

వంశీ పైడిపల్లి దర్శకత్వంతో మహేశ్‌బాబు నటించిన ‘మహర్షి’ ఉత్తమ వినోదాత్మక చిత్రంగా అవార్డు లభించింది. దీంతో పాటు ఈ సినిమాకు సంబంధించే ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా రాజు సుందరం, ఉత్తమ నిర్మాణ సంస్థగా దిల్‌రాజుకు చెందిన శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌ అవార్డులు పొందాయి. ఈ అవార్డు దక్కడంపై శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ హర్షం వ్యక్తం చేసింది.

67వ జాతీయ చలన చిత్ర అవార్డులు

* ఉత్తమ నటుడు: ధనుష్‌(అసురన్‌), మనోజ్‌ బాయ్‌పాయ్‌(భోంస్లే)

* ఉత్తమ నటి: కంగనా రనౌత్‌(ఝాన్సీ)

* ఉత్తమ దర్శకుడు: బహత్తార్‌ హూరైన్‌

* ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి(ది తాష్కెంట్‌ ఫైల్స్‌)

* ఉత్తమ సహాయ నటుడు: విజయ్‌ సేతుపతి(సూపర్‌ డీలక్స్‌)

* ఉత్తమ చిత్రం(హిందీ): చిచోరే

* ఉత్తమ చిత్రం(తెలుగు): జెర్సీ

* ఉత్తమ చిత్రం(తమిళం): అసురన్‌

* ఉత్తమ కొరియోగ్రాఫర్‌: రాజు సుందరం(మహర్షి)

* ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రఫీ: అవనే శ్రీమన్నారాయణ(కన్నడ)

* ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్‌: మరక్కర్‌ అరబ్‌(మలయాళం)

* ఉత్తమ సంగీత దర్శకుడు: జ్యేష్టపుత్రో

* ఉత్తమ మేకప్‌: హెలెన్‌

* ఉత్తమ గాయకుడు: కేసరి(తేరి మిట్టీ)

* ఉత్తమ గాయని: బర్దో(మరాఠీ)

More Related Stories