English   

డిసెంబ‌ర్ 7న క‌వ‌చం.. రిస్క్ ఏమో బెల్లంకొండ‌.. 

Kavacham
2018-11-28 17:08:23

అస‌లే ఇప్పుడు వ‌ర‌స ఫ్లాపుల‌తో పాపం కెరీర్ ఎటు పోతుందో తెలియ‌ని ప‌రిస్థితుల్లో ఉన్నాడు బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్. ఈయ‌న న‌టించిన ప్ర‌తీ సినిమా రావ‌డం పోవ‌డం జ‌రుగుతున్నాయి కానీ నిల‌బ‌డ‌టం లేదు. ఇక ప్ర‌స్తుతం ఈయ‌న రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఇందులో క‌వ‌చం ముందుగా వ‌స్తుంది. ఈ చిత్రం డిసెంబ‌ర్ 7న విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో బెల్లంకొండ స‌ర‌స‌న‌ కాజ‌ల్, మెహ్రీన్ న‌టిస్తున్నారు. శ్రీ‌నివాస్  మామిళ్ల ద‌ర్శ‌కుడు. ఇందులో పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నాడు బెల్లంకొండ‌. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కోటి డిజిట‌ల్ వ్యూస్ అందుకుని సినిమాపై ఆస‌క్తి.. అంచ‌నాలు పెంచేసింది ఈ టీజ‌ర్. అయితే రొటీన్ సినిమాగా ముద్ర కూడా వేసుకుంది క‌వ‌చం. 

ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ తో శ్రీ‌నివాస్ మామిళ్ళ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. హ‌ర్షవ‌ర్ధ‌న్ రానే, బాలీవుడ్ న‌టుడు నీల్ నితిన్ ముఖేష్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే క‌వ‌చం షూటింగ్ పూర్తైంది.. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. ఎస్ఎస్ థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా.. ఛోటా కే నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. వంశ‌ధార క్రియేష‌న్స్ సంస్థ‌లో న‌వీన్ సొంటినేని(నాని) క‌వ‌చం సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్ 7 విడుద‌ల అంటే ఆ రోజు ఎన్నిక‌ల రోజు.. మ‌రి పోలింగ్ డే రోజు సినిమాలు వ‌చ్చినా ప్రేక్ష‌కులు అటు వైపు చూస్తారా అనేది ఆస‌క్తిక‌ర‌మే. మ‌రి చూడాలి.. క‌వ‌చం అయినా బెల్లంకొండ కెరీర్ కు క‌వచంగా మారుతుందో లేదో..? 

More Related Stories