English   

7 సినిమాకి అనుకోని షాక్ 

 7 movie
2019-06-05 09:13:50

జీనియస్ ఫేం హవీష్ హీరోగా ఆరుగురు భామలు రెజీనా, నందితా శ్వేత, అనీషా ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడలతో కలిసి నటించిన ‘7’ సినిమాకి కోర్టు షాకిచ్చింది. ఈ సినిమా రిలీజ్ మీద హైదరాబాద్ సివిల్ కోర్ట్ స్టే విధించింది. ఈ చిత్రానికి నిజార్ షఫీ దర్శకత్వం వహించగా రైడ్ ఫేం రమేష్ వర్మ స్క్రీన్ ప్లే ఇవ్వడంతో పాటు ఆయనే నిర్మించారు. అయితే ఈ సినిమా నిర్మాణంలో పార్టనర్ షిప్ ఇస్తానని రమేష్ వర్మ తన దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నారని, కానీ తనకు సినిమాలో పార్టనర్ షిప్ ఇవ్వకపోగా తన దగ్గర తీసుకున్న డబ్బు కూడా వెనక్కి ఇవ్వలేదని ఎన్ ఆర్ ఐ కిరణ్ తలశిల కోర్టులో ఫిర్యాదు చేశారు. నిజానికి ఈ విషయమై ఎన్నిమార్లు అడిగినా రమేష్ వర్మ స్పందించలేదని, ఫిల్మ్ ఛాంబర్ దృష్ఠికి తీసుకు వెళ్లినా తనకు న్యాయం జరగకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సివచ్చిందని కిరణ్ తెలిపారు. నిజానికి ఈ సినిమా రేపు రిలీజ్ కావాల్సి ఉంది, కానీ కోర్టు స్టే ఇవ్వడంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడినట్టే. ఈ సినిమాతో అయినా తన కెరీర్ గాడిలో పడుతుందని హవీష్ భావిస్తున్నాడు, అందుకే తనకి మార్కెట్ లేదని తెలిసినా కధనే నమ్ముకుని ఏకంగా ఆరుగురు హీరోయిన్స్ ని పెట్టుకుని మరీ సినిమా చేశాడు.

More Related Stories