English   

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చావుకు ప్రధానమైన 7 కారణాలు ఇవేనా...

 Sushant Singh
2020-06-21 10:26:47

బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి కారణం ఏమై ఉంటుందని ఆలోచిస్తే అందరూ కలిసి డిప్రెషన్ అని చెప్తున్నారు. అసలు అంత స్టార్ డమ్ ఉన్న హీరోకు.. అంత ఫేమ్ ఉన్న హీరోకు డిప్రెషన్ ఏంటి అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ కాస్త లోతుగా ఆలోచిస్తే ఆయన డిప్రెషన్‌కు కొన్ని ప్రధానమైన కారణాలు కనిపిస్తున్నాయి. అందులో 7 కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. వాటివల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడేమో అనిపిస్తుంది.

1. అంకిత లోఖండే: ప్రాణంగా ప్రేమించిన తన గాళ్ ఫ్రెండ్ అంకితా లోఖండే దూరం కావడంతో అప్పట్నుంచి కూడా ఈయన డిప్రెషన్‌లోనే ఉన్నాడు. పవిత్ర రిష్తాలో కలిసి నటించిన ఈ ఇద్దరూ.. ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా అనివార్య కారణాలతో 2016లో విడిపోయారు. దాన్ని మరణానికి ముందు వరకు కూడా జీర్ణించుకోలేకపోయాడని సుశాంత్ పర్సనల్ డాక్టర్ చెప్పడం గమనార్హం.

2. ఓ బడా నిర్మాతతో జగడం: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయే ముందు వరకు కూడా ఓ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నాడు. ఆమెనే 2020 నవంబర్‌లో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ ఆ హీరోయిన్ విషయంలోనే ఓ బడా నిర్మాతతో సుశాంత్‌కు గొడవ జరిగిందని.. చంపేస్తామంటూ బెదిరింపులు కూడా వచ్చాయని తెలుస్తుంది.

3. భారీ సినిమాలు చేజారిపోవడం: చిచోరే లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత 8 సినిమాలు సుశాంత్ సింగ్ చెంతకు వచ్చాయి. కానీ ఆర్నెళ్ల గ్యాప్‌లోనే అన్నీ ఈయన చేజారిపోయాయి. చివరికి ఒక్క సినిమా కూడా లేకుండా పోయాడు సుశాంత్. అది కూడా డిప్రెషన్‌కు కారణమై ఉంటుంది.

4. కెరీర్ మొదట్నుంచీ చిన్నచూపు: సుశాంత్ సింగ్‌ను కెరీర్ మొదట్నుంచి కూడా చిన్నచూపు చూసారు బాలీవుడ్ పెద్దలు. ఔట్ సైడర్ కావడంతో తమలో కలుపుకోడానికి ఇష్టపడలేదు. ఒంటరిని చేసారు.. అంతేకాదు సినిమాలు చేస్తామని చెప్పి రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, బేఫికరేతో పాటు మరో అరడజన్ సినిమాల్లోంచి సుశాంత్ సింగ్‌ను తప్పించారు.

5. వెబ్ సిరీస్ డబ్బులు: సుశాంత్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో చెప్పడానికి చిన్న ఉదాహరణ చాలు. చిచోరే దర్శకుడు మొన్న జనవరిలో సుశాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. అయితే దానికి బదులుగా రిప్లై ఇస్తూ థ్యాంక్ యూ సర్.. నాకు మీరు ఇంకొక్క సినిమాలో అవకాశం ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ చేసాడు. దాన్నిబట్టి సుశాంత్‌ను ఎలా తొక్కేసారో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఓ వెబ్ సిరీస్‌కు సైన్ చేస్తే అక్కడ్నుంచి కూడా డబ్బులు రాలేదని తెలుస్తుంది.

6. మాజీ మేనేజర్ దిశా ఆత్మహత్య: సుశాంత్ మాజీ మేనేజర్ దిశా ఆత్మహత్య కూడా సుశాంత్ మరణానికి కారణంగా మారి ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈమె కారణంగానే సుశాంత్ ఓ వెబ్ సిరీస్‌కు సైన్ చేసాడు. అక్కడ్నుంచి 14 కోట్ల రూపాయాలు రావాల్సి ఉంది.. కానీ రాలేదు. అది కూడా ఈయన డిప్రెషన్‌కు కారణంగా మారి ఉంటుందని ప్రచారం జరుగుతుంది.

7. నెపోటిజమ్: అన్నింటికంటే ముఖ్యమైంది.. బాలీవుడ్‌లో ప్రధానంగా పాతుకుపోయింది నెపొటిజమ్. ఇది కూడా సుశాంత్ ఆత్మహత్యలో కీలకమే. టన్నుల కొద్దీ టాలెంట్ ఉన్నా.. కెరీర్‌లో 3 వంద కోట్ల సినిమాలున్నా కూడా ఈయన్ని పట్టించుకోలేదు దర్శక నిర్మాతలు. కొన్ని నిర్మాణ సంస్థలు సుశాంత్‌ను బ్యాన్ చేసాయి. అది ఈ కుర్ర హీరోలో మరింత డిప్రెషన్ పెంచేసింది. ఏదేమైనా కూడా భవిష్యత్ సూపర్ స్టార్ చాలా త్వరగా ఇక్కడి రాజకీయాలకు బలైపోయాడు.

More Related Stories