English   

పందిపిల్లతో వస్తున్నా రవిబాబు

Ravi Babu’s Adhugo Movie Releasing on November 7th
2018-10-26 08:40:19

అగ్గిపుల్ల‌.. స‌బ్బుబిల్ల‌.. కుక్క‌పిల్లా.. కాదేదీ క‌విత‌కు అన‌ర్హం అన్నారు మ‌హాక‌వి శ్రీ‌శ్రీ‌. దీన్ని తూచా త‌ప్ప‌కుండా పాటిస్తున్నాడు ర‌విబాబు. డిఫెరెంట్ సినిమాల‌కు పెట్టింది పేరు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్పుడు కూడా అదిగో అనే సినిమా చేస్తున్నాడు ర‌విబాబు. ఇందులో హీరో కంటే కీల‌క పాత్ర‌లో ఓ పందిపిల్ల న‌టిస్తోంది. దీన్ని ప్ర‌త్యేకంగా విదేశం నుంచి తెప్పించాడు ర‌విబాబు. తాజాగా ఈ సినిమా ప్ర‌మోష‌న్ ను చాలా డిఫెరెంట్ గా చేస్తున్నాడు ర‌విబాబు. ఆ మ‌ధ్య కొత్త నోట్లు వ‌చ్చిన‌పుడు కావాల‌నే ఎటిఎం క్యూలో చంక‌లో పందిపిల్ల‌తో ద‌ర్శ‌న‌మిచ్చాడు. దేశంలోని చిల్ల‌ర‌ క‌ష్టాల‌ను త‌న సినిమా ప్ర‌మోష‌న్ కు ఇలా వాడుకున్నాడు ర‌విబాబు. ఇప్ప‌టికే రాజ‌మౌళి ఈగ‌ను పెట్టి సినిమా తీసాడు.. అంత‌కు ముందు గోదావరిలో కుక్కను పెట్టి సినిమా చేసాడు శేఖ‌ర్ కమ్ముల‌.. గ‌తంలో పొట్టేలును పెట్టి ఓ సినిమా చేసాడు సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు రామనారాయ‌ణ‌. ఇక ఇప్పుడు పంది పిల్ల‌ను వాడుకుంటున్నాడు ర‌విబాబు.

Ravi Babu’s Adhugo Movie Releasing on November 7th

అవును.. న‌చ్చావులే.. నువ్విలా.. ఇలాంటి విభిన్న‌మైన ప్ర‌య‌త్నాలు చేసిన ర‌విబాబు.. ఇప్పుడు అదిగో అనే సినిమా చేస్తున్నాడు. టైటిల్ విన‌డానికే విచిత్రంగా ఉంది కదా..! కాన్సెప్ట్ ఇంకా విచిత్రంగా ఉంటుంది. ఇందులో హీరో హీరోయిన్ల‌తో పాటు పందిపిల్ల కూడా కీల‌క‌పాత్ర‌లో న‌టించ‌నుంది. తెల్ల‌టి పందిపిల్ల‌తో ర‌విబాబు ఇచ్చిన పోజు భ‌లే విచిత్రంగా అనిపిస్తుంది ఇప్పుడు. ఇండ‌స్ట్రీలో ఈ సినిమా గురించి టాపిక్ న‌డుస్తుంది. ఈ సినిమా న‌వంబ‌ర్ 7న విడుద‌ల కానుంది. గ‌తంలో త‌న సినిమాల‌ను కుక్క‌పిల్ల‌లు, ఏనుగుల‌తో ప‌బ్లిసిటీ చేసుకున్నాడు ర‌విబాబు. ఇప్పుడు ఏకంగా పందిపిల్ల‌తో సినిమా చేస్తున్నాడు. ఇన్నాళ్లూ విఎఫ్ఎక్స్ ప‌నుల్లో బిజీగా ఉన్న అదిగో సినిమా త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మ‌రి ఈ పందిపిల్ల క‌హానీ ఎలా ఉండ‌బోతుందో..?

More Related Stories