English   

పవన్ కళ్యాణ్ దారిలో రామ్ చరణ్.. 70 లక్షల విరాళం..

Ram Charan
2020-03-26 15:01:25

బాబాయ్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్ఫూర్తితో అబ్బాయ్ రామ్ చరణ్ కూడా భారీ విరాళం అందించారు. బాధితుల సహాయార్థం ఈయన కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 70 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించాడు. ఇదే విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు మెగా పవర్ స్టార్. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో తాను ఈ సహాయం చేయడానికి ముందుకు వచ్చినట్టు సూచించాడు రామ్ చరణ్. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీ నుంచి నితిన్ 20 లక్షలు.. త్రివిక్రమ్ 20 లక్షలు.. వినాయక్ 5 లక్షలు.. పవన్ కళ్యాణ్ రెండు కోట్లు ఇలా ఎవరికి తోచింది వాళ్ళు ఇచ్చారు. ఇంకా చాలామంది హీరోలు విరాళం అందించడానికి ముందుకు వస్తున్నారు. 

కరోనా వైరస్ బాధితులను ఆదుకోవడంలో తమ బాధ్యతగా హీరోలు అడుగు ముందుకు వేస్తూ ఉండటం అభినందనీయం. అయితే టాలీవుడ్లో చిరంజీవి, మహేష్ బాబు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలు ఇంకా ఈ విషయంపై స్పందించలేదు. వీళ్ళ నుంచి కూడా విరాళాలు అందుకే కొంత భారీ మొత్తం అవుతుంది అంటున్నారు అభిమానులు. ప్రభుత్వం కూడా కరోనా వైరస్ బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చింది. ఈ హడావిడి మొత్తం తగ్గిన తర్వాత ఈ బాధితుల విరాళాల కోసం తెలుగు ఇండస్ట్రీ అంతా కలిసి ఒక పెద్ద కార్యక్రమం చేపట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా ఇలాగే చేసి దాదాపు 15 కోట్ల రూపాయలు సేకరించారు. ఇప్పుడు కూడా ఇలాంటి పని చేయాలని చూస్తున్నారు సినీ పెద్దలు. 

More Related Stories