English   

70 ఏళ్ల వయసులో తండ్రి అయిన స్టార్ హీరో..

Richard Gere
2020-04-25 11:56:29

వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. హాలీవుడ్ సూపర్ స్టార్ రిచర్డ్ గేర్ ఇప్పుడు సంచలనం సృష్టించాడు. ఈయన ఏకంగా 70 ఏళ్ల వయసులో ఒక మగ బిడ్డకు తండ్రి అయ్యాడు. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆనందపడాలో ఆయన జోరు చూసి సిగ్గు పడాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఏడాది కిందే ఓ బిడ్డకు తండ్రి అయిన  రిచర్డ్.. మరో ఏడాది తిరిగేలోపు ఇంకో బిడ్డకు తండ్రి అయ్యాడు.  70 ఏళ్ల వయసులో ఇదేం జోరు బాబు అంటున్నారు ఆయన్ను చూసి. రిచర్డ్ ప్రస్తుత భార్య అలెజాండ్రా సిల్వాను ఈ వయసులో తల్లిని చేసి ఏకంగా ఓ బిడ్డను కన్నాడు. 2018లో ఈయన అలెజాండ్రాను పెళ్లి చేసుకున్నాడు. ఆమె వయసు 37 ఏళ్లు. ఇప్పటికే ఈ జంటకు ఓ కొడుకు ఉన్నాడు. ఇప్పుడు మరో బిడ్డకు తండ్రి అయ్యాడు. ఇదిలా ఉంటే మాజీ భార్యతో ఇప్పటికే రిచర్డ్ గేర్‌కు 20 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అతడి పేరు హామర్. ఇప్పుడు హామర్‌కు తమ్మున్ని కూడా ఇచ్చాడు ఈయన. రిచర్డ్‌కు తండ్రి అయినందుకు అతడి మాజీ భార్య కంగ్రాట్స్ చెప్పడం గమనార్హం. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఈ వార్త బాగానే వైరల్ అవుతుంది. 

More Related Stories