English   

700 కిమీ న‌డిచి సోనూను క‌ల‌సిన అభిమాని

 Sonu Sood
2021-06-11 16:26:57

రీల్ విల‌న్ నుండి రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న న‌టుడు సోనూసూద్. ఇప్ప‌టి వ‌ర‌కూ సోనూ ఎన్నో స‌హాయ కార్య‌క్ర‌మాలు చేసి రియ‌ల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దాంతో సోనూసూద్ ను సినిమా న‌టుడిగా కంటే రీల్ హీరోగా ఓ మంచి మాన‌వ‌త్వం ఉన్న వ్య‌క్తిగా అభిమానించే వారి సంఖ్య పెరిగిపోయింది. కాగా తాజాగా ఓ అభిమాని ఏకంగా సోనూసూద్ పై ఉన్న అభిమానంతో అత‌డిని క‌లిసేందుకు కాలిన‌డ‌క‌న హైద‌రాబాద్ నుండి ముంబైలోని సోనూసూద్ నివాసం వ‌ర‌కూ వెళ్లాడు. వికారాబాద్ కు చెందిన వెంక‌టేష్ అనే సోనూ అభిమాని సోనూసూద్ ను క‌లిచేందుక‌ని న‌డుచుకుంటూ హైద‌రాబాద్ వెళ్లాడు. 

అక్క‌డ నుండి ప‌ది రోజుల్లో 700 కి.మీ లు న‌డిచి ఎట్ట‌కేల‌కు త‌న అభిమాన రియ‌ల్ హీరోను క‌లిసాడు. కాగా వెంక‌టేష్ ను చూసిన సోనూసూద్ చ‌లించిపోయాడు. అత‌డిని చూసిన వెంటనే సోనూ ఎమోష‌నల్ అయ్యాడు. ఈ మేర‌కు సోనూసూద్ ఓ ట్వీట్ చేశారు. ట్వీట్ లో..."వెంకటేష్ నన్ను కలవడానికి హైద‌రాబాద్  నుండి ముంబై వరకు చెప్పులు లేకుండా నడిచాడు, నేను అతని కోసం   రవాణా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ అత‌డు ఒప్పుకోలేదు. అతను నిజంగా స్ఫూర్తిదాయకం. అయినప్ప‌టికీ ఇలాంటివి చేసి ఎవ‌రూ ఇబ్బంది ప‌డ‌కూడ‌దు." అంటూ సోనూసూద్ పేర్కొన్నారు. 

More Related Stories