English   

75 కోట్ల మార్క్ అందుకున్న ఎఫ్2.. నెక్ట్స్ 80 ఫ‌స‌క్..

F2
2019-02-01 07:21:35

ఒకరోజు గడుస్తుంటే ఎఫ్2 సినిమా ఒక్కో రికార్డును దాటేస్తూ పోతుంది. ఈ సినిమా దూకుడు చూస్తుంటే ఇంకా ఎన్ని రికార్డులు బద్దలైపోతాయో కూడా క్లారిటీ రావడం లేదు. రోజురోజుకు దూకుడు పెరుగుతూనే ఉంది కాని తగ్గడం లేదు. 20 రోజుల తర్వాత ఈ చిత్రం ఏకంగా 75 కోట్లు షేర్ వసూలు చేసింది. గ్రాస్ 125 కోట్లకు చేరిపోయింది. ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మరో సినిమా లేకపోవడంతో దూకుడు అడ్డు లేకుండా పోయింది. గబ్బర్ సింగ్, గీతగోవిందం ఇలాంటి సినిమాల రికార్డులను ఇప్పటికే దాటేసింది ఎఫ్ 2 సినిమా. ఇప్పుడు వెంకటేష్, వరుణ్ తేజ్ చూపులు అత్తారింటికి దారేది సినిమాపై పడ్డాయి. ఈ చిత్రం పేరు మీద ఉన్న 80 కోట్ల రికార్డును అందుకోవాలని చూస్తుంది ఎఫ్2. ఇదే జోరు కొనసాగితే ఈ వారంలోనే అత్తారింటికి దారేది కూడా మాయం కావడం ఖాయంగా కనిపిస్తోంది. కుటుంబ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని నెత్తిన పెట్టుకోవడంతో బాక్సాఫీస్ దగ్గర అస్సలు తగ్గడం లేదు ఈ ఎఫ్ 2. ఫుల్ రన్లో 90 కోట్లు వసూలు చేసినా ఆశ్చర్యం లేదు. ఇదేగాని జరిగితే అనిల్ రావిపూడి సరికొత్త సంచలనానికి తెర తీసినట్లే. మ‌రో రెండు వారాలు పెద్ద సినిమాలేవీ లేక‌పోవ‌డంతో ఇప్ప‌ట్లో ఎఫ్2 దూకుడు త‌గ్గ‌డం క‌ష్ట‌మే. చూడాలి మరి.. ఎఫ్2 ఇంకెన్ని రికార్డుల‌ను వరుణ్ తేజ్, వెంక‌టేశ్ అందుకుంటారో లేదో.

More Related Stories