English   

కూలీ నెంబర్ వన్ తో కూలీ నెంబర్ 786

Venkatesh
2018-11-02 18:29:50

సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ మాత్రమే. నో లాజిక్స్.. ఓన్లీ లాఫ్స్ అనే మాటను బలంగా నమ్మే దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ నమ్మకంతోనే ఎంటర్టైన్మెంట్ అందిస్తూ హ్యాట్రిక్ కొట్టాడీ దర్శకుడు. ప్రస్తుతం ‘‘ఎఫ్ -2’ ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అనే సినిమా చేస్తున్నాడు అనిల్. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తోన్న ఈ మూవీ కూడా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ అని చెబుతున్నారు. కాకపోతే ఈ ఇద్దరి ఇమేజ్ లకు అనుగుణంగా ఉంటుందా ఎంటర్టైన్మెంట్. ప్రస్తుతం చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఎఫ్ -2 ప్రొడక్షన్ ఆల్మోస్ట్ పూర్తి కావొచ్చింది. ఈ యేడాదే విడుదల చేసేలా ప్రయత్నం చేస్తోందీ మూవీ టీమ్. అయితే సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తోన్న దర్శకుడు అనిల్ రావిపూడి లేటెస్ట్ గా వెంకీ అండ్ వరుణ్ తేజ్ ను వెరైటీగా చూపిస్తున్నానని చెప్పకనే చెబుతున్నట్టుగా ఓ ఫోటో ట్వీట్ చేశాడు.
 
విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ఒకప్పుడు మెమరబుల్ హిట్ గా నిలిచిన సినిమా ‘కూలీ నెంబర్ వన్’. టబు హీరోయిన్ గా పరిచయమై ఈ మూవీ వెంకీకి కమర్షియల్ గా బిగ్గెస్ట్ సక్సస్ ను ఇచ్చింది. రైల్వే కూలీగా వెంకీ నటనకు ఆడియన్స్ సూపర్ హిట్ కట్టబెట్టారు. ఇప్పుడు ఎఫ్ -2 లోనూ మరోసారి అదే డ్రెస్ తో ఆయన కూలీ కోడ్ నంబర్.. వన్ ను కేటాయించాడు.వెంకీతో పాటు వరుణ్ కు కూడా ఓ నెంబర్ ప్లేట్ ఇచ్చాడు. విశేషంగా ఇది మెగాస్టార్ నంబర్. ఆయన ఖైదీ నెంబర్ 786 నుంచి ఖైదీ తీసేసి ఇచ్చిన నంబర్.  మరి ఇందులో వారి పాత్రలేంటో కానీ.. ఈ పోస్టర్ మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక వెంకటేష్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. వరుణ్ తో మెహ్రీన్ కౌర్ రొమాన్స్ చేయబోతోంది. మొత్తంగా ఈ యేడాదే విడుదల చేసేలా ప్లాన్ చేస్తోన్న ఈ మూవీతో అనిల్ మరో కంప్లీట్ ఎంటర్టైనర్ ను ఇచ్చేలానే ఉన్నాడు. 

More Related Stories