ఫేక్ ఫాలోవర్స్ స్కాంలో దీపికా, ప్రియాంకలు..మరో 8 మంది కూడా

సోషల్ మీడియా అంటేనే ఒక రచ్చ. ఇక్కడ మంచి వాళ్ళు ఉంటారు ఎదవలు ఉంటారు. మంచి వాళ్ళు తగిలితే పర్లేదు కానీ ఎదద్వాలు తగిలితేనే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ గోల అంతా ఎందుకు అనుకున్నారో లేక అందరికంటే తామే ముందు ఉండాలని అనుకున్నారో తెలీదు కానీ కొందరు బాలీవుడ్ హీరోయిన్స్ ఫేక్ ఫాలోవర్స్ ను సంపాదించి ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. నిజానికి సోషల్ మీడియాలో హీరో హీరోయిన్స్ ను అనుసరించే వారి సంఖ్య మిలియన్లలో ఉంటుంది. ఒకరకంగా హీరో హీరోయిన్స్ కు ఉన్న ఆదరణ, ఇమేజ్‌కు ఫాలోవర్స్ సంఖ్య ప్రామాణికమని చెబుతున్నారు. అయితే కొందరు డబ్బులు ఇచ్చి అక్రమ మార్గాల ద్వారా ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటున్నారని కొన్ని సంస్థలు జరిపిన పరిశోధనలో వెల్లడైందని ముంబయి పోలీసులు చెబుతున్నారు.
అలా ఫాలోవర్స్ పేరిట అమ్ముకోడానికి ఫేక్ ప్రొఫైల్స్ సృష్టిస్తున్న అభిషేక్ దినేష్ దౌడే అనే వ్యక్తిని ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. డిజిటల్ మార్కెటింగ్ సంస్థలో పనిచేసే అతడు డబ్బులు తీసుకుంటూ సెలబ్రిటీల ఫాలోవర్స్ సంఖ్యను పెంచుతున్నట్లుగా, ఫేక్ ఫాలోవర్స్‌ను సృష్టిస్తున్నట్లు తేలిందట. ఈ ఫేక్ సోషల్‌మీడియా స్కామ్ కేసులో ప్రియాంకచోప్రా, దీపికా పదుకునేలను పోలీసులు ప్రశ్నించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు మరో ఎనిమిది మంది బాలీవుడ్ ప్రముఖుల్ని ఈ కేసులో విచారించనున్నట్లుగా తెలిసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణేలు లీడింగ్ లో ఉన్నారు.