English   

కేజీఎఫ్ టైమ్స్..జనవరి 8న టీజర్‌

 KGF Chapter 2
2021-01-04 18:40:10

కేజీఎప్ 2  2018లో వచ్చిన కేజీఎఫ్‌ ఛాప్టర్‌1కు సీక్వెల్‌ అన్న విషయం తెలిసిందే. ఇందులో రాఖీ భాయ్‌గా యశ్‌.. పవర్‌ఫుల్‌ విలన్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ నటిస్తున్నారు. శ్రీనిధి శెట్టి, రవీనా టండన్‌, ప్రకాశ్‌ రాజ్‌, రావు రమేష్‌, మాళవిక అవినాష్‌ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. గత రెండేళ్లుగా చిత్రీకరణ జరుపుకొంటున్న కేజీఎఫ్‌-2 ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే హీరో యశ్‌, సంజయ్‌ దత్‌లపై చిత్రీకరించే భాగం పూర్తి చేసుకోగా ఫైనల్‌ షెడ్యూల్‌ జనవరిలో పూర్తి కానుంది.

కేజీఎఫ్‌-2 నుంచి స్టన్నింగ్‌ లుక్‌ను సోమవారం విడుదల చేశాడు. ‘సామ్రాజ్యం తలుపు తెరవడానికి కౌంట్‌డౌన్‌ ఇప్పుడు ప్రారంభమవుతుంది’ అని ఒక చేతిలో కర్ర పట్టుకొని హీరో యశ్‌ చీకట్లో దర్జాగా కూర్చున్న ఫోటోను ట్విటర్‌లో  షేర్‌ చేశారు. దీనితోపాటు టీజర్‌ విడుదల తేదిని ప్రకటించారు. జనవరి 8న కేజీఎఫ్‌2 టీజర్‌ను రిలీజ్‌ చేయనున్నట్లు వెల్లడించారు. యశ్‌ ఫోటో నెట్టింటా వైరలవుతోంది. అంతేగాక కేజీఎఫ్‌ చాప్టర్‌2 హ్యష్‌ట్యాగ్‌ ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతోంది. 

More Related Stories