English   

ద‌బంగ్ కు 8 ఏళ్లు.. తీపిక‌బురు చెప్పిన స‌ల్మాన్.. 

Salman-Khan
2018-09-11 15:33:10

సెప్టెంబ‌ర్ 10.. 2010.. అంటే స‌రిగ్గా ఎనిమిదేళ్ల కింద బాలీవుడ్ లో ఓ కుదుపు వ‌చ్చింది. ఆ సంచ‌ల‌నం పేరు ద‌బంగ్. స‌ల్మాన్ ఖాన్ అప్ప‌టికి పెద్ద విజ‌యాల్లో ఏం లేడు. వ‌ర‌స ఫ్లాపుల నుంచి త‌ప్పించుకుని వాంటెడ్ సినిమాతో ఓదార్పు విజ‌యం అందుకున్నాడు అంతే. మ‌ళ్లీ ఆ త‌ర్వాత వీర్ ఫ్లాప్ తో మ‌నోడికి చుక్క‌లు క‌నిపిస్తున్న టైమ్ అది. అలాంటి టైమ్ లో వ‌చ్చింది ద‌బంగ్. అభిన‌వ్ క‌శ్య‌ప్ అనే కొత్త ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ న‌చ్చి.. ఈ సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాడు స‌ల్మాన్ ఖాన్. తాను ఒప్పుకునేట‌ప్పుడు తెలియ‌దు ఓ చ‌రిత్ర‌కు సైన్ చేస్తున్నాన‌ని. ఎందుకంటే ద‌బంగ్ విడుద‌లైన త‌ర్వాత బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దూకుడు మామూలుగా లేదు.
 
వాంటెడ్ తో మూత‌బ‌డిన చాలా సింగిల్ స్క్రీన్స్ ఓపెన్ అయితే.. ద‌బంగ్ త‌ర్వాత మ‌ళ్లీ వాటికి క‌ళ వ‌చ్చింది. చుల్ బుల్ పాండేగా స‌ల్మాన్ సంచ‌ల‌న న‌ట‌న రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. ఇదే సినిమా తెలుగులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌న్నెండేళ్ల ఆక‌లిని తీర్చింది. గ‌బ్బ‌ర్ సింగ్ గా ఇక్క‌డ కూడా రికార్డులు సృష్టించింది దబంగ్. బాలీవుడ్ లో ఇదే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సోనాక్షి సిన్హా. ఈ సినిమా ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా అభిమానుల‌కు ఓ తీపిక‌బురు చెప్పాడు కండ‌ల‌వీరుడు. 2019లో తాను ద‌బంగ్ 3 చేయ‌బోతున్న‌ట్లు అనౌన్స్ చేసాడు. ఇప్ప‌టికే నాలుగేళ్ల కింద వ‌చ్చిన ద‌బంగ్ 2 కూడా విజ‌యం సాధించింది. ఇప్పుడు మూడో భాగంతోనూ వ‌చ్చేస్తున్నాడు ఈ చుల్ బుల్ పాండే. మ‌రి ఈ సినిమా ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించ‌బోతుందో చూడాలిక‌..!

More Related Stories