English   

బాలకృష్ణ మరో బాంబు.. 80స్ పార్టీకి నన్ను పిలవలేదు..

Balakrishna
2020-06-11 02:09:11

ప్రతి సంవత్సరం 1980 లో ఉన్న నటులు అందరూ కలిసి పార్టీ చేసుకోవడం ఇండస్ట్రీలో అలవాటుగా మారింది. గత పదేళ్లుగా ఈ పార్టీలు జరుగుతున్నాయి. ఒక్కోసారి ఒక్కొక్కరు ఈ పార్టీ ఇస్తున్నారు. ఓసారి అంబరీష్.. మరోసారి మోహన్ లాల్.. ఇంకోసారి మమ్ముట్టి ఇలా ప్రతి సంవత్సరం పార్టీ ఏర్పాటు చేసుకుంటున్నారు. గతేడాది మెగాస్టార్ చిరంజీవి తన కొత్త ఇంట్లో 80 లో ఉన్న వాళ్లందరికీ గెట్ టు గెదర్ పార్టీ ఇచ్చాడు. అందులోనే తన సైరా నరసింహారెడ్డి సినిమా విజయ వేడుకను కూడా జరుపుకున్నాడు. తన పాత స్నేహితులతో కలిసి ఆడాడు పాడాడు. అయితే ఆ పార్టీలో బాలకృష్ణ కనిపించలేదు. ఏదో పని ఉండి ఈయన రాలేకపోయాడు అని అంతా అనుకున్నారు.. కానీ ఇప్పుడు బాలకృష్ణ ఒక సంచలన విషయం బయట పెట్టాడు. చిరంజీవి ఇంట్లో జరిగిన పార్టీకి నన్ను ఎవరు పిలవలేదు అంటూ సంచలన కామెంట్స్ చేశాడు బాలకృష్ణ.

బెంగళూరులో, కేరళలో, తమిళనాడులో జరిగిన పార్టీలకు నేను కూడా వెళ్ళాను.. కానీ ఇక్కడ హైదరాబాద్లో జరిగిన పార్టీకి.. ముఖ్యంగా చిరంజీవి ఇంట్లో జరిగిన ఆ వేడుకకు నన్ను ఎవరు పిలవలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు బాలయ్య. నన్ను దూరం పెడితే మొత్తంగా దూరం పెట్టండి. అంతేకానీ ఇలా ఆడుకోవద్దు.. అప్పుడు నా దారి నేను చూసుకుంటాను అంటూ అసలు విషయం బయట పెట్టాడు బాలయ్య. ఈ విషయం తెలిసిన తరువాత నిజంగానే ఇండస్ట్రీలో ఒంటరి చేస్తున్నారు అనే ఫీలింగ్ కూడా వస్తుంది. ఎందుకంటే ఆ వేడుకలో చిరంజీవి నాగార్జున వెంకటేష్ కనిపించారు. ఇతర ఇండస్ట్రీలో నుంచి కూడా చాలా మంది వచ్చారు. మరి బాలయ్యను ఎందుకు పిలవలేదు అనే విషయం మాత్రం చిరంజీవికి తెలియాలి అంటున్నారు అభిమానులు. 

More Related Stories