English   

విజయ్ దేవరకొండకు పిచ్చ క్రేజ్.. 80 లక్షల మంది ఫాలోవ‌ర్స్

Vijay Deverakonda
2020-07-17 11:22:15

విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇన్స్టాగ్రామ్ లో కొత్త రికార్డు క్రియేట్ చేశాడు ఈ రౌడీ హీరో. 8 మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించుకున్న‌ సౌత్ ఇండియాలోనే ఫస్ట్ హీరోగా నిలిచాడు. 80 లక్షల ఫాలోవ‌ర్స్ మార్కు దాటటంతో విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో.. ర‌చ్చ చేస్తున్నారు. విజయ్ కు ఇంత మంది పాలోవర్స్ ఉండటానికి రీజన్ ఆయనను దేశవ్యాప్తంగా అందరూ అభిమానించటమే అని చెబుతున్నారు. విజయ్ నటించిన తెలుగు సినిమాలు ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’… హిందీలో డబ్ కావడంతో అక్కడ కూడా అత‌డికి ఫ్యాన్స్ అయ్యారు. ఇక ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో విజయ్ చేస్తున్న సినిమా ప్యాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతుంది.

More Related Stories