English   

కరోనాకు మరో భారీ సినిమా బలి.. 83 వాయిదా..

83film
2020-03-21 07:38:02

తెలుగులోనే కాదు.. ఇండియన్ సినిమాకు కూడా ఇప్పుడు కరోనా వైరస్ చుక్కలు చూపిస్తుంది. వేల కోట్ల నష్టాలు వస్తున్నాయి. దాంతో పాటు భారీ సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు అలా పోస్ట్ పోన్ అయ్యాయి. ఇప్పుడు 83 కూడా ఇదే దారిలో వెళ్తుంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం 83. ఇండియాకు ప్రపంచ కప్ తీసుకొచ్చిన 1983 టీం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కించాడు కబీర్ ఖాన్. ముఖ్యంగా లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ జీవితంలోని కొన్ని సంఘటనలు ఈ చిత్రంలో ఉన్నాయి. ఈ స్పోర్ట్స్ డ్రామాపై భారీ అంచనాలున్నాయి. ఏప్రిల్ 10న తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మళయాల భాషల్లో విడుదల కావల్సి ఉంది ఈ చిత్రం. కానీ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో భాగంగా తమ సినిమాను వాయిదా వేసుకుంటున్నట్లు అనౌన్స్ చేసారు చిత్ర నిర్మాతలు. సినిమాల కంటే ముందు మనందరం బాగుండాలి.. ఆరోగ్యం బాగుంటేనే అన్నీ బాగుంటాయి.. భారతీయులందరి భద్రత, ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం అని చెప్పుకొచ్చారు నిర్మాతలు. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ కపిల్ దేవ్ గా నటిస్తుండగా కపిల్ భార్య పాత్రలో దీపికా పదుకొనె నటించడం విశేషం. దర్శకుడు కబీర్ ఖాన్ ఈ సినిమాను 100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కించాడు. విష్ణు ఇందూరి, షాజిద్ నడియావాలా, కబీర్ ఖాన్ నిర్మాతలు.

More Related Stories