English   

బన్నీ సినిమాకి 85 కోట్లు...అయినా మహేష్ సినిమా తర్వాతే

Mahesh Babu Allu Arjun Collections.jpg
2020-01-14 11:05:18

ఒకప్పుడు సినిమాల రికార్డులంటే సినిమా ఎన్ని ఎక్కువ రోజులు ఆడింది, ఎన్ని సెంటర్లలో 100 రోజులు ఆడింది అనే లెక్కలని బట్టి చెప్పే వారు. కానీ ఇప్పుడు కాలం మారింది. 100 రోజులు అనేవి అసలు లేకుండా పోయాయి. ఇప్పుడు అసలు ఎంత వసూలు చేసింది అనేది రికార్డ్. ప్రస్తుతం ఈ లెక్కల రికార్డులన్నీ ‘బాహుబలి 2’ పేరిటే ఉన్నాయి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ఒక్క సందేహంతో ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మ రధం పట్టారు.

ఇక అందుకే దాన్ని పక్కన పెట్టేసి నాన్ బాహుబలి రికార్డులు అని చెప్పుకోవడం మొదలు పెట్టారు. ఇక తాజాగా అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో బన్నీకి ఉన్న క్రేజ్‌ను బట్టి ఓపెనింగ్స్ అదిరిపోతాయని ముందే ఊహించారు. కానీ, ఎవ్వరి ఊహకు అందని విధంగా బన్నీ సినిమా కలెక్షన్స్ వచ్చాయని ప్రకటించింది సినిమా యూనిట్. ఈ సినిమా తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.85 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.85 కోట్ల గ్రాస్ వసూలు చేసినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ‘అల వైకుంఠపురములో’ షేర్ రూ. 29.45 కోట్లు వసూలైంది. ప్రపంచ వ్యాప్తంగా బన్నీ సినిమాకు రూ.85 కోట్ల గ్రాస్ వసూలైనా.. తెలుగు రాష్ట్రాల్లో షేర్ లెక్కల బట్టి మహేష్‌దే పైచేయిగా ఉంది. 

11న విడుదలైన మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు రూ. 32.77 కోట్ల షేర్ వసూలు చేసింది. మహేష్ బాబు సినిమా తరవాతే ‘అల వైకుంఠపురములో’ నిలిచింది. 

More Related Stories