English   

టీవీ9 కు మరో షాక్

Singa Rao
2020-10-14 08:56:17

తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నేళ్లుగా టాప్ న్యూస్ ఛానల్ గా ఉన్న టీవీ-9 కు ప్రస్తుతం గట్టు పరిస్థితులు ఎదురవుతున్నాయి. తాజాగా టీవీ-9 సీఓఓ (ఛానల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్) సింగారావు రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాకు గల కారణాలు ఇంకా తెలియలేదు. మాజీ సీఈవో రవిప్రకాష్ టివి9 కు రాజీనామా చేసిన తరువాత ఛానల్ మేనేజ్మెంట్ కొత్తవాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది. రవిప్రకాష్ కోర్టు కేసుల్లో చిక్కుకోవడంతో కొత్త మేనేజ్మెంట్ ఇబ్బందులు ఎదుర్కొంది. అంతే కాకుండా కొత్త మేనేజ్మెంట్ కు అంతగా కలిసి రాలేదు. అంతే కాకుండా ఇటీవల వచ్చిన లాక్ డౌన్ కారణంగా కూడా ఛానల్ నష్టాల బాట పట్టింది. మరోవైపు తెలంగాణ వార్తలు ఎక్కువ రాయాలని మేనేజ్మెంట్ ఒత్తిడి తేవడం. తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలకు సపోర్ట్ ఇస్తూ వార్తలు రాయడంతో రెండు రాష్ట్రాల్లో నంబర్ 1 స్థానంలో ఉన్న ఛానల్ రేటింగ్ కూడా పడిపోయింది. ఓ వైపు కరోనా దెబ్బ....మరో వైపు రేటింగ్ దెబ్బ తో ఛానల్ డీలా పడింది. ఇక ఈ నేపథ్యంలో ఛానల్ ను మళ్ళీ మొదటి స్థానంలో నిలబెట్టడానికి యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

More Related Stories