జనవరి 9న పెళ్లి...ప్రకటించిన సింగర్ సునీత

2020-12-31 16:27:16
టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత తన పెళ్లి తేదీని ప్రకటించింది. ప్రముఖ డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేనితో జనవరి 9వ తేదీన తన వివాహాం జరుగబోతున్నట్లు తెలిపారు. లేటెస్ట్ గా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది సింగర్ సునీత. అనంతరం తన పెళ్ళి వార్తలపై స్పందిస్తూ.. ‘వచ్చే నెల 9వ తేదీన నా వివాహాం జరగనుంది’ అని తెలిపింది. కరోనా కారణంగా తొమ్మిది నెలలు శ్రీవారి దర్శనానికి దూరమయ్యాను. అలాగే కొత్త జీవితం బాగుండాలని ఆ శ్రీవారిని ప్రార్ధించాను. ఇప్పుడు వైకుంఠ ద్వారం గుండా ఆ స్వామిని దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అని సునీత తెలిపింది. కొవిడ్ ప్రభావంతో కొద్ది మంది సన్నిహితుల మధ్యే సునీత వివాహం జరగనుంది.