English   

సెప్టెంబర్ 9న రింగులోకి విజయ్ లైగర్

 Vijay Devarakonda
2021-02-11 16:31:15

విజయ్ దేవరకొండ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా "లైగర్". సినిమా టైటిల్ లోనే ఎంతో పవర్ ఫుల్ మీనింగ్ వచ్చేలా పూరీ టైటిల్ ను ఎంపిక చేసుకున్నాడు. మగ సింహం మరియు ఆడ పులికి పుట్టిన బిడ్డను లైగర్ అని పిలుస్తారు. ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. సినిమాలో విజయ్ కిక్ బాక్సర్ గా కనిపిస్తున్నాడు. విజయ్ సరసన హీరోయిన్ గా అనన్య పాండే నటిస్తోంది. పూరిజగన్నాథ్, కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను చిత్రయూనిట్ ప్రకటించింది. చిత్రాన్ని 2021 సెప్టెంబర్ 9 థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్టు స్పష్టం చేసింది. ఈ సంధర్బంగా చిత్ర యూనిట్ విజయ్ పోస్టర్ ను కూడా పోస్ట్ చేసింది. పోస్టర్ లో విజయ్ లాంగ్ హెయిర్ తో కిక్ బాక్సర్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఓ వైపు క్రేజీ డైరెక్ట్ మరోవైపు క్రేజీ హీరో ఉండటంతో ఈ ఏ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక సెప్టెంబర్ లో రింగులోకి దిగుతున్న "లైగర్" ఏ మేరకు అలరిస్తాడో చూడాలి.

More Related Stories