English   

ఏక్ మినీ కథకు 9 కోట్ల ఆఫర్ 

Ek Mini Katha
2021-05-13 14:52:22

ఇప్పుడు ఏక్ మినీ కథ సినిమా కూడా నేరుగా ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. కార్తిక్ రాపోలు అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రంలో సంతోష్ శోభన్ హీరోగా నటించాడు. యువీ సంస్థ నిర్మించిన ఈ చిన్న సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు చాలా ప్రయత్నించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా అది కుదరలేదు. దీంతో ఓటీటీలో విడుదల చేయాలని భావించారు.  అడల్ట్ టచ్ కామెడీ మూవీ కావడంతో అమెజాన్‌ కూడా మంచి రేటుకే కొనేందుకు ముందుకు వచ్చిందట. రూ.9 కోట్లకు ఈ సినిమాను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో కొనుగోలు చేసినట్లు సమాచారం. వాస్తవానికి ఈ సినిమాకు నిర్మాతలు రూ.5 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు ఏకంగా 9 కోట్లకు బేరం కుదరడంతో నిర్మాతలు సంతోషంగా ఉన్నారట. త్వరలోనే ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

More Related Stories