English   

రేపు బరిలోకి తొమ్మిది సినిమాలు..ఆ రెండు సినిమాలపైనే అందరి చూపు

nithiin check
2021-02-25 14:55:00

వారాల్లో శుక్రవారం అంటే సినిమా ప్రేమికులకు ఎంతో ఇష్టమైన రోజు. శుక్రవారం సినిమాల విడుదలతో థియేటర్ల వద్ద సందడి వాతావరణం కనిపిస్తుంది. గత వారానికి ముందు కేవలం 50 శాతం సీటింగ్ కు మాత్రం ఉండగా పోయిన వారం నుండి 100 శాతం సీటింగ్ అనుమతులు ఇచ్చారు. దాంతో థియేటర్ల వద్ద మళ్ళీ పూర్వ వైభవం కనిపిస్తోంది. ఇక పోయిన వారం మొత్తం నాలుగు సినిమాలు విడుదల కాగా వాటిలో  నాంది సినిమాకు హిట్ టాక్ రావడంతో మంచి కలెక్షన్స్ వచ్చాయి. 

విశాల్ చక్ర, సుమంత్ కాపఠధారి, ధ్రువ సర్జఆ పొగరు సినిమాలు అంచనాలు అందుకోలేకపోయాయి. ఇక ఈ వారం ఏకంగా 9 సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. వాటిలో నితిన్ హీరోగా నటిస్తున్న "చెక్" సినిమా పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమాలో నితిన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.  ఇక మరో సినిమా అక్షర పై కూడా కొంతమేరకు అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు పలువురు టాలివుడ్ సెలబ్రెటీలు సపోర్ట్ ఇవ్వడంతో పాటు ఎమ్మెల్సీ కవిత కూడా ఆడియో ఫంక్షన్ కు హాజరై సినిమాపై హైప్ ను క్రియేట్ చేశారు. ఇక మిగతా సినిమాల పేర్లు కూడా ప్రేక్షకులకు పెద్దగా తెలియదు.

More Related Stories