English   

ఆథ‌రైజ్డ్ డ్రింక‌ర్  90 ఎంఎల్  టీజర్

90ML TEASER
2019-09-21 14:37:15

ఆర్‌ఎక్స్ 100 హీరోగా పాపులర్ అయ్యాడు కార్తికేయ. నిజానికి అంతకు ముందే ఒక సినిమా చేసినా ఈ సినిమానే ఆయనకు పేరు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత మరో రెండు మూడు సినిమాలు చేసినా ఆయన ఇమేజ్‌ని మరో మెట్టేక్కించే కొత్త చిత్రమేదీ కార్తికేయ కెరీర్‌లో పడ లేదు. యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చిన ఆర్‌ఎక్స్‌లాంటి మరో మంచి సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నా -తరువాతి ప్రాజెక్టులేవీ అంత పేరు తెచ్చిపెట్టలేకపోయాయి. ఇటీవల నానీ కి విలన్గా గ్యాంలీడర్ సినిమాలో చేసిన విలన్ పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టినా అది కూడా కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడేదేం కాదు. కార్తికేయ హీరోగా చేస్తున్న తాజా ప్రాజెక్టు -90 ఎంఎల్. దర్శకుడు శేఖర్‌రెడ్డి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని అశోక్ గుమ్మకొండ నిర్మిస్తున్నారు.

 ఈ సినిమా నుంచి ఈరోజు టీజర్‌ రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఈరోజు హీరో పుట్టినరోజు పునస్కరించుకుని ఈ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ మొదట్లోనే హీరో తల్లి తన కడుపునా దేవదాస్ లాంటి ఒక డ్రింకర్ పుట్టాలని కోరుకుంటుంది. దీంతో కాళిదాస్ లాంటి ఒక రైటరో, ఏసుదాస్ లాంటి సింగారో పుట్టాలని కోరుకుండా ఇలా కోరుకున్నావు ఏంటమ్మా అని హీరో అనడం. ఆ తర్వాత అజయ్ తో ఫైట్ లో డీజిల్ తో నడిచే బళ్ళను చూసుంటావు, పెట్రోల్ తో నడిచే బళ్ళను చూసుంటావు, కానీ ఇది లిక్కర్ తో నడిచే బండి గుద్దితే అడ్రెస్ ఉండదు అని చెప్పడం హైలైట్ గా నిలుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక లుక్ వేసెయ్యండి.

More Related Stories