90 ఎంఎల్ రిలీజ్ డేట్ లాక్

ఆర్ఎక్స్ 100 సినిమాతో ఊహించని విజయాన్ని అందుకున్న యంగ్ హీరో కార్తీకేయ ఆ తర్వాత నటించిన ‘హిప్పీ’, ‘గుణ 369’ సినిమాలు మాత్రం పెద్దగా విజయం సాధించలేదు. హీరో పాత్రలకే కాకుండా క్యారెక్టర్ ఇంపార్టెన్స్, విలన్ రోల్స్‌కి కూడా ఓకే చెబుతున్న కార్తీకేయ ఇటీవలే నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో ప్రతినాయకుడిగా నటించి మెప్పించాడు. ఇక కార్తీకేయ 90 ఎంఎల్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. టీజర్‌తోనే ఈ సినిమా మీద ఒకరకైమైన అంచనాలు పెంచడంలో సఫలం అయ్యాడు.
ఇక ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కన్ఫార్మ్ చేసుకుంది. ఇక ఈ సినిమా వచ్చే నెల అంటే డిసెంబర్ 25న సినిమా థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోన్న ఈ మూవీని కార్తికేయ సొంత సంస్థ క్రియేటివ్ వర్క్ నిర్మిస్తోంది. నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సిన్మా ద్వారా శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. 90 ఎంఎల్ అనే టైటిల్ కి తగ్గట్టుగానే సినిమా కూడా వైవిధ్యంగా ఉండేలా ప్లాన్ చేస్తోంది యూనిట్. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన రెండు పాటలను రిలీజ్ చేశారు. వాటికి మంచి రెస్సాన్స్ వచ్చింది. చూడాలి మరి ఈ సినిమా ఏమేరకు ఆకట్టుకుంటుందో ?