English   

నితిన్ కు అంత బడ్జెట్ వర్కౌట్ అవుతుందా.. పవర్ పేట90..

Power Peta
2020-05-09 17:47:00

భీష్మ సినిమాతో విజయం అందుకుని మంచి జోరు మీదున్నాడు నితిన్. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. అందులో వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న రంగ్ దే.. చంద్రశేఖర్ ఏలేటి సినిమా.. మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న అంధధూన్ రీమేక్ ఉన్నాయి. మూడు సినిమాల తర్వాత తాజాగా మరో భారీ సినిమాకు నితిన్ కమిట్ అయ్యాడు. చల్ మోహనరంగా సినిమాతో నితిన్ కు ఫ్లాప్ ఇచ్చిన కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో సినిమా రాబోతోందని ప్రచారం జరుగుతుంది. పవర్ పేట పేరుతో రాబోతున్న ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 90 కోట్లు ఉంటుందని ప్రచారం జరుగుతుంది. 

ఇది తెలిసిన తర్వాత నితిన్ అభిమానులు సంతోషించడం మానేసి భయపడుతున్నారు. ఇప్పటివరకు సోలోగా 30 కోట్లు కూడా నితిన్ సినిమాలు వసూలు చేయలేదు. ఆ..ఆ 48 కోట్లు వసూలు చేసిన అక్కడ త్రివిక్రమ్ హ్యాండ్ ఉంది. ఇప్పటి వరకు నితిన్ మార్కెట్ 25 కోట్ల దగ్గరే ఆగిపోయింది. ఇలాంటి సమయంలో ఒకే సినిమాపై 90 కోట్ల బడ్జెట్ పెట్టడం అనేది తలకు మించిన భారమే. కానీ అది భారం కాదు అంటున్నారు దర్శక నిర్మాతలు. కథకు అనుగుణంగా పెట్టాల్సి వస్తుంది అంటున్నారు వాళ్ళు. ఒకవేళ ఇంత బడ్జెట్ వర్కౌట్ ఐతే మాత్రం నితిన్ రేంజ్ మారిపోయినట్లే. ఈయన కూడా స్టార్ హీరోల జాబితాలో చేరినట్లే. మరి కృష్ణ చైతన్య తెరకెక్కించబోతున్న పవర్ పేట ఎలా వుంటుందో చూడాలి. 

More Related Stories