English   

టాలీవుడ్ లో 90% క్యాస్టింగ్ కౌచ్ ఉంది..బాంబే హీరోయిన్లు సిద్దపడే వస్తారు 

Tejaswi
2020-06-14 17:38:46

తేజస్వి మాదివాడ అంటే ఎవరూ గుర్తు పట్టరేమో కానీ ‘బిగ్‌బాస్ లో కౌశల్ లో గొడవ పెట్టుకున్న తేజస్వి అంటే యిట్టె గుర్తు పడతారు. హౌస్ లోపల పొట్టి పొట్టి దుస్తులు వేసుకుని గ్లామర్ షో చేసిన తేజస్వి, అప్పటికే పెళ్లైన సామ్రాట్‌ తో ఆన్ కెమెరా సరసాలు సాగించింది. తేజస్వి,సామ్రాట్ ఇన్సిడెంట్ అప్పట్లో పెద్ద డిస్కర్షన్‌ రేపింది. వాటితో సంబంధం లేకుండా ‘బిగ్‌బాస్’ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత సైలెంట్ అయిపొయింది. కానీ తేజస్వి తాజాగా క్యాస్టింగ్ కౌచ్ మీద షాకింగ్ కామెంట్స్ చేసింది. టాలీవుడ్‌లో 90 శాతం కాస్టింగ్ కౌచ్ ఉందని కమిట్‌మెంట్లకు ఓకే చెబితేనే అవకాశాలు వస్తాయని ఆమె కుండబద్దలు కొట్టింది. అంతేకాదు తనను కూడా ఎంతో మంది నేరుగా పడకగదికి ఆహ్వానించారని, తను అందుకు ఒప్పుకోకపోవడం వల్లే సక్సెస్ ఫుల్ నటిని కాలేకపోయానని ఆమె చెప్పింది. 

తేజస్వి లక్ష్మీ కాంత్ అనే దర్శకుడు తెరకెక్కించిన కమిట్‌మెంట్ అనే సినిమాలో నటించింది. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఛానల్‌కు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. నాకు తెలిసిన హీరోయిన్లు చాలామందికి కాస్టింగ్ కౌచ్ అనుభవాలున్నాయని కానీ, వారెవరూ బయటకు చెప్పుకోరని ఆమె చెప్పుకొచ్చింది. బాంబే హీరోయిన్స్ దేనికైనా ఒప్పుకొంటారనే ఏకైక కారణంతో వారికి అవకాశాలిస్తారని తేజస్వి బాబు వేసింది. బాంబే అమ్మాయిలు కమిట్‌మెంట్లకు మానసికంగా సిద్ధపడి వస్తారు కాబట్టే వారు ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఉంటారని ఆమె చెప్పుకొచ్చింది. అలాని బాలీవుడ్ నుంచి వచ్చే వారంతా అలా ఉంటారని కాదని కొంతమంది వల్లే ఇలాంటి చెడ్డపేరు తెలుగు హీరోయిన్లకు వస్తుందని చెప్పుకొచ్చింది.  

More Related Stories