English   

90ల్లోకి వెళ్లిపోతున్న హ‌రీష్ శంక‌ర్..

Harish-Shankar
2018-10-06 13:08:14

గ‌తంలోకి వెళ్లిపోవ‌డం ఇప్పుడు ఫ్యాష‌న్ అయిపోయింది. ద‌ర్శ‌కులు అంతా కాలాన్ని వెన‌క్కి తీసుకెళ్తున్నారు. ఇప్ప‌టికే చాలా మంది ద‌ర్శ‌కులు అలా చేసి చ‌రిత్ర సృష్టించారు. ఈ ఏడాది మ‌హాన‌టి.. రంగ‌స్థ‌లం కూడా అలా వ‌చ్చిన క‌థ‌లే. ఇప్పుడు హ‌రీష్ శంక‌ర్ కూడా ఇదే చేస్తున్నాడు. సుకుమార్, నాగ్ అశ్విన్ 80ల్లోకి వెళ్లి ఆగితే.. ఇప్పుడు హ‌రీష్ శంక‌ర్ కాస్త ముందుకొచ్చి 90ల్లో అడుగు పెడుతున్నాడు. ఈయ‌న మ‌రోసారి రీమేక్ క‌థ‌నే హ్యాండిల్ చేస్తున్నాడు. చుట్టూ తిరిగి.. ఏడాదిన్న‌ర ఖాళీగా ఉండి చివ‌రికి దిల్ రాజుతోనే సెట్ అయ్యాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్పుడు ఈయ‌న‌కు 96 సినిమా రీమేక్ బాధ్య‌త‌లు ఇస్తున్నాడు రాజు. 

ఇప్ప‌టికే సినిమా చూసి చాలా బాగుంద‌ని ట్వీట్ చేసాడు హ‌రీష్ శంక‌ర్. తాను చేస్తున్నాన‌ని చెప్ప‌లేదు కానీ ఈ మ‌ధ్య కాలంలో చూసిన అత్యంత గొప్ప సినిమాల్లో ఇది కూడా ఒక‌టి అని ట్వీట్ చేసాడు హ‌రీష్ శంక‌ర్. ఓ త‌మిళ్ సినిమాను విడుద‌ల రోజే చూసి మ‌రీ ట్వీట్ చేసాడంటే ఏంటి అర్థం..? ఇప్ప‌టికే దిల్ రాజు ఈ చిత్ర రీమేక్ రైట్స్ తీసుకున్నాడు. మ‌రి చూడాలిక‌.. ద‌బంగ్ ను గ‌బ్బ‌ర్ సింగ్ ను అద్భుతంగా రీమేక్ చేసిన హ‌రీష్ శంక‌ర్ ఇప్పుడు 96ను ఏం చేస్తాడో..? అన్నీ కుదిర్తే ఈ చిత్రంలో నాని న‌టించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అయితే దీనిపై న్యాచుర‌ల్ స్టార్ ఇంకా ఏం నిర్ణ‌యం తీసుకోలేదు. 

More Related Stories