English   

90 ML ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్ చేశారు 

Kartikeya 90ML
2019-11-30 16:25:06

కార్తికేయ కథానాయకుడిగా చేసిన ఆర్ ఎక్స్ 100 యూత్ లో ఆయనకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. అయితే ఆ తరువాత హీరోగా ఆయన చేసిన సినిమాలేవీ అంతగా ఆడలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల నానీస్ గ్యాంగ్ లీడర్ సినిమాలోని విలన్ పాత్ర మాత్రం ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టింది. తాజాగా అయన హీరోగా చేసిన మరో సినిమా 90 ML. శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాని అశోక్ గుమ్మకొండ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టింది. దీనిలో భాగంగానే ఈ సినిమా నుండి ఇప్పటీకే టీజర్, ట్రయిలర్, పాటలను ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేశారు. ఈరోజు  సాయంత్రం 6.30 గంటలకు, జూబ్లీహిల్స్ లోని రావి నారాయణరెడ్డి స్టేడియం లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ సినిమాలో కార్తికేయ సరసన నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తుండగా… రవి కిషన్, రావు రమేష్, అలీ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

More Related Stories