English   

హీరోయిన్ ర‌ష్మిక కోసం 900కిమీ న‌డిచిన తెలంగాణ కుర్రాడు

Rashmika Mandanna
2021-06-25 13:01:58

సినిమావాళ్ల కోసం వంద‌ల కిలోమీట‌ర్లు ప్ర‌యాణించ‌డం వాళ్ల‌ను క‌లిసి మురిసిపోవ‌డం ఇప్పుడు అభిమానులకు కామ‌న్ అయ్యింది. త‌మ ఫేవ‌రెట్ సెల‌బ్రెటిల కోసం ఎంత దూర‌మైనా వెళ్లి కలుస్తున్నారు. అయితే తాజాగా ర‌ష్మిక  క‌లిసేందుకు  అభిమాని  తెలంగాణ నుండి  స్వ‌గ్రామానికి వెళ్లాడు. రష్మిక మందనను వెండితెర మీద చూసి బోర్ కొట్టిందేమో నేరుగా చూద్దామని నిర్ణయించుకున్నాడు. దానికోసం ఏకంగా తొమ్మిది వందల కిలోమీటర్లు ప్రయాణించాడు. అయితే తీరా వెళ్లాక ర‌ష్మిక షూటింగ్ కోసం ముంబైలో ఉంద‌ని తెలిసి షాక్ ఇయ్యాడు. 

పూర్తి వివ‌రాల్లోకి వెళితే... తెలంగాణలోని ఆకాష్ త్రిపాటి అనే అభిమాని రష్మికను నేరుగా చూడాలి అనుకుని కర్ణాటకలోని విరాజ్ పేట కు వెళ్లాడు. అక్కడికి మొదటి ట్రైన్ ద్వారా ప్రయాణం చేసి ఆ తర్వాత రోడ్డు మార్గంలో ర‌ష్మిక‌ ఊరు చేరుకున్నాడు. అక్కడికి చేరిన వెంటనే రష్మిక మందన ఇల్లు ఎక్కడ అంటూ అందరినీ అడగగా అక్కడి ప్రజలకు డౌట్ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ఆకాష్ త్రిపాటిని మంద‌లించ‌గా అస‌లు విషయం చెప్పేశాడు. దాంతో పోలీసులు రష్మిక ప్రస్తుతం ఇక్కడ లేదని ముంబైలో సినిమా షూటింగ్ లో ఉంద‌ని చెప్పారు. దాంతో ఆకాష్ త్రిపాటి త‌న ఫేవ‌రెట్ హీరోయిన్ ను చూడ‌కుండానే ఇంటికి రావాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. 

More Related Stories