English   

అంత‌రిక్షం 9000 kmph రివ్యూ:

Antariksham
2018-12-21 10:20:25

తొలి సినిమా ఘాజీతో సంచ‌ల‌నం సృష్టించిన ద‌ర్శ‌కుడు సంక‌ల్ప్ రెడ్డి. ఈయ‌న మ‌రోసారి చేసిన ప్ర‌యోగం అంత‌రిక్షం. ఈ సినిమా ఎలా ఉంది.. నిజంగానే మ‌రోసారి ఘాజీలా సంక‌ల్ప్ అద్భుతం చేసాడా అనేది చూద్దాం.. 

క‌థ‌:

దేవ్(వ‌రుణ్ తేజ్) ఇండియ‌న్ స్పేస్ సెంట‌ర్లో ప‌ని చేస్తుంటాడు. ఆయ‌న త‌న డ్రీమ్ అయిన విబ్ర‌యిన్ అనే శాటిలైట్ స్పేస్ కు పంపిస్తాడు. కానీ అది ఫెయిల్ అవుతుంది. దాంతో అప్ప‌ట్నుంచి స్పేస్ సెంట‌ర్ నుంచి దూరంగా వెళ్తాడు. ఐదేళ్ళ పాటు ఎవ‌రికీ క‌నిపించ‌డు. కానీ అప్పుడు మ‌ళ్లీ ఇండియాకు దేవ్ అవ‌స‌రం వ‌స్తుంది. స్పేస్ లో దారి త‌ప్పిన ఓ శాటిలైట్ ను కోడ్ చేయ‌డం దేవ్ వ‌ల్లే అవుతుంద‌ని చెప్పి మ‌ళ్లీ పిలుస్తారు. అప్పుడు త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన విబ్ర‌యిన్ డేటా కూడా వెన‌క్కి తీసుకురావాల‌ని చూస్తాడు దేవ్. అప్పుడు ఏం జ‌రిగింది.. అస‌లు స్పేస్ లోకి వెళ్లి అత‌డు ఏం చేసాడు అనేది క‌థ‌.. 

విశ్లేష‌ణ‌: 

ఘజీతో అద్భుతం చేసిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి.. రెండో సినిమాకు స్పేస్ కథ తీసుకోవడం ఆసక్తి పుట్టించింది. దానికి తోడు ఆకట్టుకునే ట్రైలర్.. విజువల్స్ కూడా అంచనాలు పెంచేసాయి. ఆ నమ్మకంతోనే థియేటర్ లోకి వెళ్లాను.. ఘజీ మాదిరే టైం వేస్ట్ చేయకుండా నేరుగా కథలోకి వెళ్ళాడు దర్శకుడు. తొలి సీన్ నుంచే ఎదో చేస్తున్నారు అనిపించేలా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ వేగంగానే పూర్తి అయింది.. కానీ కథలో ఆ వేగం కనిపించలేదు.. స్పేస్ లోకి వెళ్లిన తర్వాత కథ అక్కడే ఆగిపోయింది. ముందుకు వెనక్కి వెళ్లలేక స్పేస్ లొనే ఆగిపోయింది కథ.. దానికి తోడు అక్కడ వాళ్ళు మాట్లాడే భాష తెలుగు అయినా.. ఆస్ట్రోనట్ కోడ్స్ ప్రేక్షకులకు అర్థం కాకపోవడం మైనస్.. కానీ దానికి వేరే ఆప్షన్ లేదు.. అక్కడ అదే మాట్లాడాలి.. కథ చిన్నది కావడం అంతరిక్షంకు ప్రతికూలం.. ఎమోషనల్ సీన్స్ అంతగా వర్కవుట్ కాలేదు.. వరుణ్ తేజ్ తన పాత్రకు న్యాయం చేశాడు.. మిగిలిన వాళ్ళు బాగా నటించారు.. దర్శకుడిగా రెగ్యులర్ కాకుండా డిఫరెంట్ సినిమాలు చేస్తున్న సంకల్ప్ అభిరుచి అభినందనీయం.. ఓవరాల్ గా అంతరిక్షం ప్రయత్నం బాగుంది.. కానీ అనుకున్నంత మాత్రం ఆసక్తి పుట్టించ‌లేదు. 

న‌టీన‌టులు:

వ‌రుణ్ తేజ్ త‌న పాత్ర‌కు న్యాయం చేసాడు. ద‌ర్శ‌కుడు న‌మ్మింది ఉన్న‌దున్న‌ట్లు చూపించాడు. ఆయ‌న‌కు తోడుగా అదితిరావ్ హైద్రీ కూడా బాగుంది. లావ‌ణ్య త్రిపాఠి చిన్న పాత్ర‌లో మెరిసింది. రెహ‌మాన్ స్పేస్ సెంట‌ర్ డైరెక్ట‌ర్ గా బాగున్నాడు. అవ‌స‌రాల శ్రీ‌నివాస్, స‌త్య‌దేవ్, రాజా అంతా త‌మ త‌మ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. ఘాజీ మాదిరే మ‌రోసారి మంచి క్యాస్టింగ్ తీసుకున్నాడు ద‌ర్శ‌కుడు సంక‌ల్ప్. 

టెక్నిక‌ల్ టీం:

టెక్నిక‌ల్ టీంలో అంద‌రికంటే ఎక్కువ మార్కులు సినిమాటోగ్ర‌ఫర్ జ్ఞాన‌శేఖ‌ర్ కు ప‌డతాయి. అద్భుత‌మైన విజువ‌ల్స్ అందించాడు ఆయ‌న‌. ఇక సంగీతం బాగుంది. ఆర్ఆర్ అద్భుతంగా ఇచ్చాడు ప్ర‌శాంత్ విహారి. ఫ‌స్టాఫ్ అంతా వేగంగా సాగిపోయింది కానీ సెకండాఫ్ సా..గింది. క‌థ లేక స్పేస్ లోనే వేలాడింది. సంక‌ల్ప్ రెడ్డి మంచి ప్ర‌య‌త్నం చేసాడు. కానీ దాన్ని స్క్రీన్ పై చూపించ‌డంలో మాత్రం విఫ‌లం అయ్యాడు. మ‌రింత టైట్ స్క్రీన్ ప్లే ఉండుంటే అంత‌రిక్షం మ‌రో స్థియిలో ఉండేదేమో..? 

చివ‌ర‌గా: అంత‌రిక్షం.. మంచి సినిమానే.. కానీ కండీష‌న్స్ అప్లై.. 

రేటింగ్: 2 / 5.

More Related Stories