English   

90ML సినిమా ఎలా రిలీజ్ అవుతుందో చూస్తాం..

Karthikeya 90 ML
2019-12-06 12:24:40

తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య కథే లేని సినిమాలైనా వస్తున్నాయి కానీ కాంట్రవర్సి లేని సినిమాలు మాత్రం అస్సలు రావడం లేదు. ఇప్పుడు కార్తికేయ నటించిన 90 ఎమ్మెల్ సినిమా కూడా ఇలాంటి వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ సినిమా డిసెంబర్ 6న థియేటర్లకు వచ్చింది. కానీ ఈ సినిమాను విడుదల కానివ్వకుండా ఎలాగైనా అడ్డుకుంటామంటూ మద్యపాన నిషేధం పోరాట సమితి సభ్యులు ప్రకటించారు. 

థియేటర్లలోకి సినిమాలు రాకుండా ాంతియుతంగా అడ్డుకుంటామని తెలిపారు. సినిమా విడుదల సమయంలో ఐమాక్స్ థియేటర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతామని వెల్లడించారు. శేఖర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో హీరో కచ్చితంగా మద్యపానం చేయాల్సిందే. రోజుకి 90ml మందు తాగకపోతే చనిపోయే పరిస్థితి కలుగుతుంది. దీంతో అదే హీరోకి అలవాటుగా మారుతుంది. దీంతో ఈ సినిమా మద్యపానాన్ని ప్రోత్సహించేలా ఉందని.. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్న ఈ సినిమా రిలీజ్ కావడానికి వీళ్లేదని పోరాట సమితీ సభ్యులు తమ అభిప్రాయాన్ని తెలిపారు. 

ఇలాంటి సినిమాల వల్లే యూత్ చెడిపోతున్నారని.. వాళ్ళు పెడదోవ పడుతున్నారని.. ఆ కారణంగా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 90 ఎమ్మెల్ సినిమాలో మద్యం సేవించే సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు. సినిమా పేరుని కూడా మార్చాలని చెప్పారు. కానీ అవేవీ జరగకపోవడంతో సినిమా రిలీజ్ అడ్డుకుంటామని అంటున్నారు. కార్తికేయ సొంత బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. మరి ఇప్పుడు ఈ సినిమా శాంతియుతంగా విడుదల అవుతుందో లేదో చూడాలి.

More Related Stories