English   

ఆ నిర్మాత కొడుకు సరసన 96 భామ !

Shiva-Kandukuri
2019-01-07 19:47:20

ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగు పెట్టాలనుకునే వారికి అండగా సినిమా వాసనలు ఉన్న వారసత్వం ఉంటే అది వారికి ఒక ధనపు బలం. ఎందుకంటే ఇండస్ట్రీలో లోటుపాట్లు తెలియడంతో పాటు ఛాన్స్ కోసం జనాల వెనక తిరగాల్సిన అవసరం ఉండదు. ఈ విషయం విజయ్ దేవరకొండ విషయంలో నిజం అయ్యింది. తన మొదటి సినిమా లైఫ్ ఈజ్ బ్యీటుఫుల్ కి ఎవరైనా సహాయం చేసారో లేదో తెలీదు కానీ తన మొదటి హిట్ కి మాత్రం తన సొంత మేనమామ యష్ రంగినేని మరో నిర్మాత రాజ్ కందుకూరిని కలుపుకుని హీరోగా లాంచ్ చేసి స్టార్ హీరోని చేసుకున్నాడు. ఇక ఇప్పుడు రాజ్ కందుకూరి వంతు ఆయన తన సొంత కొడుకును హీరోగా పరిచయం చేయాలని అనుకుంటున్నాడు. రాజ్ కందుకూరి కొడుకు శివ అమెరికాలో చదువులు పూర్తి చేసి ఇండియాకి తిరిగొచ్చాడు. ఇక్కడకు వచ్చేముందే హీరోగా రాణించడానికి అవసరమైన యాక్టింగ్ - డ్యాన్స్ - ఫైట్స్ వంటి వాటిలో అక్కడే ట్రయినింగ్ తీసుకుని వచ్చాడట. దీంతో తన కొడుకు లాంచ్ అయ్యే సినిమాని తానే స్వయంగా నిర్మించ బోతున్నాడు. అలాగే బ్రాండింగ్ కోసం ఈ సినిమాకు సురేష్ బాబు సమర్పకుడిగా ఉండనున్నారు. ఇంతకూ ముందు సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో సహాయ దర్శకురాలిగా చేసిన శేష సింధు రావు ఈ చిత్రంకు దర్శకత్వం వహించబోతుంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా తమిళ ‘96’ ఫేం వర్షను ఎంపిక చేశారని తెలుస్తోంది. ఇక సినిమాకి గోపీ సుందర్ సంగీతం అందిస్తుండగా మహానటికి రచయితగా పని చేసిన పద్మావతి విశ్వేశ్వర్ ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నారు. అంటే మరో ప్రొడ్యూసర్ కొడుకు హీరో అవుతున్నట్టే మరి. 

More Related Stories