English   

96 తెలుగు రీమేక్‌...ఇక అఫీషియల్ !

Sharwanand
2019-01-26 15:03:58

గ‌త‌ ఏడాది త‌మిళ సూప‌ర్ హిట్ చిత్రాల‌ జాబితాలో ముందు వరుసలో నిలిచిన 96 సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. విజయ్ సేతుపతి , త్రిష జంటగా నటించిన ఈ త‌మిళ చిత్రం ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కింది. అయితే ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించింది, అంతే కాక ఈ సినిమాకి విమ‌ర్శకుల ప్ర‌శంస‌లు ల‌భించాయి. అయితే ఈ చిత్ర తెలుగు రైట్స్ దిల్ రాజు ద‌క్కించుకోగా త్వ‌ర‌లోనే రీమేక్ కి సంబంధించిన విష‌యాలు ప్ర‌కటిస్తాన‌ని గ‌తంలో చెప్పాడు. ఈ సినిమాని రామ్, గోపీ చంద్, శర్వానంద్ లకు చూపించారని ఎవరూ ఒప్పుకోవట్లేదని ఆయన టెన్షన్లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే వాటన్నిటికీ సమాధానంగా రిప‌బ్లిక్ డేని పుర‌స్క‌రించుకొని 96 రీమేక్‌పై క్లారిటీ ఇచ్చారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర బేన‌ర్‌లో 34వ చిత్రంగా రూపొంద‌నున్న ఈ చిత్రంలో శ‌ర్వానంద్‌, స‌మంత ప్రధాన పాత్ర‌లు పోషించ‌నున్న‌ట్టు ఆ ప్రకటనలో తెలిపారు. త‌మిళ వ‌ర్షెన్‌ని తెర‌కెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగులోనూ డైరెక్ట్ చేయ‌నున్నాడు. ఇక ఈ సినిమా మార్చి నుండి చిత్రం సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఇప్పటికే ఈ 96 సినిమా క‌న్న‌డ వ‌ర్షెన్‌లోను రీమేక్ అవుతుండగా 99 అనే టైటిల్‌ ని క‌న్న‌డ వ‌ర్షెన్‌కి ఫిక్స్ చేసిన‌ట్టువార్తలు వస్తున్నాయి. అయితే మనోళ్ళు ఇంకా పేరు ఫిక్స్ చేయకపోవడంతో ఏమి పేరు పెడతారా అనే ఆశక్తి నెలకొంది. 

More Related Stories