English   

తెలుగు 96 మొదలయ్యింది !

96 Movie Telugu Remake Launch
2019-04-07 08:06:55

గతేడాది తమిళంలో హిట్ అయిన ’96’ సినిమా తెలుగులో రీమేక్ అవుతుంది. ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తుండగా హీరోయిన్ గా సమంతా నటిస్తోంది. నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తుండగా తమిళ మాతృక ని తెరకెక్కించిన సి. ప్రేమ్ కుమారే తెలుగులో కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ‘జాను’ అనే టైటిల్ ను అనుకుంటున్నారట మేకర్స. శర్వానంద్ ప్రస్తుతం సుదీప్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి అవగానే శర్వా-సమంత జంటగా మూవీ తెరకెక్కనుందని అంటున్నారు. ఇక ఈరోజు ఈ సినిమాకు చెందిన పూజా కార్యక్రమం పూర్తి అయింది. ఈ సినిమా ఓపెనింగ్ షాట్ కి దర్శకుడు వంశీ పైడిపల్లి క్లాప్ ఇచ్చారు. ఇక ఈ సినిమా కోసం ఈ శర్వానంద్ కొత్త లుక్‌ లో రెడీ అయ్యాడు. 96 ని జ్ఞప్తికి తెచ్చేలాగా ఆయన బాగా గడ్డం పెంచారు.త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని నిర్మాత దిల్ రాజు తెలిపారు.

More Related Stories