English   

కెన్యా వెళ్లనున్న తెలుగు 96 టీం 

96 remake
2019-05-01 10:50:38

గ‌త‌ ఏడాది త‌మిళంలో విజయ్ సేతుపతి హీరోగా త్రిష హీరోయిన్ గా వచ్చిన 96 సినిమా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అందుకే ఈ సినిమాని తెలుగులోకి రీమేక్ చేస్తున్నాడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. నిజానికి ఈ సినిమా కోసం చాలా మంది హీరోలను సంప్రదించినా ఎవరూ ఓకే చెప్పలేదు చివరికి శర్వానంద్ ఒప్పుకోవడంతో ఆయన సరసన సమంతను ఒప్పించి ఈ మధ్యనే సెట్స్ పైకి తీసుకెళ్ళాడు. దిల్ రాజుకు చెందిన శ్రీ వెంక‌టేశ్వ‌ర బేన‌ర్‌ లో 34వ సినిమాగా రూపొందుతున్న‌ ఈ సినిమాని త‌మిళ వ‌ర్షెన్‌ని తెర‌కెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగులోను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి జాను అనే రెండు టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ మధ్యనే మారిటియ‌స్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రేపు శ‌నివారం నుండి కెన్యా వెళ్లనుందట, అక్కడే కొన్నాళ్ళ పాటు కీలక షెడ్యూల్ షూట్ చేయనున్నారట. ఆ కెన్యా షెడ్యూల్ త‌ర్వాత వైజాగ్‌, హైద‌రాబాద్‌ల‌లో కూడా కొంత షూటింగ్ చేస్తారట. ఈ సినిమాని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి మరీ తెరకెక్కిస్తున్నారు.

More Related Stories