English   

96 రీమేక్ విషయంలో దిల్ రాజు తప్పు చేశాడా..

dilraju
2020-02-08 06:59:03

జాను సినిమా విడుదలకు ముందు దిల్ రాజు దీని గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఇలాంటి సినిమా తాను నిర్మించడం అదృష్టంగా భావిస్తున్నానని.. కచ్చితంగా తన కెరీర్లో ఈ సినిమా టాప్ లో ఉంటుందని చెప్పాడు. దానికితోడు తమిళనాట 96 సినిమా సంచలనం సృష్టించింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది క్లాసిక్ అని విశ్లేషకులు కూడా తేల్చేశారు. అలాంటి సినిమాలు రీమేక్ చేయడం అంటే అనవసరంగా చేతులు కాల్చుకోవడమే అని దిల్ రాజుకు చాలా మంది చెప్పి చూశారు.. కానీ ఆయన మాత్రం ఎవరి మాటలు వినకుండా 96 సినిమాను తెలుగులో జాను పేరుతో రీమేక్ చేశాడు. సమంత అక్కినేని, శర్వానంద్ తమ తమ పాత్రలకు ప్రాణం పోశారు. అయితే ఒరిజినల్ వెర్షన్ చూసిన వాళ్ళు మాత్రం జాను సినిమాను చూడలేకపోతున్నారు. దర్శకుడు ప్రేమ్ కుమార్ ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉన్నదున్నట్లు సేమ్ టు సేమ్ కాపీ చేయడంతో ఆల్రెడీ చూసిన వాళ్ళకు జాను సినిమాపై ఆసక్తి తగ్గిపోయింది. అనుకున్నట్లుగానే విడుదల తర్వాత కూడా ఈ సినిమాకు తెలుగులో ఊహించిన రెస్పాన్స్ మాత్రం రావడం లేదు.

తమిళనాట చూసిన ప్రేక్షకులు తెలుగులో ఈ సినిమాను చూడలేకపోతున్నారు. ఇక తొలిసారి సినిమా చూస్తున్న ప్రేక్షకులు సైతం.. ఇందులో అంత గొప్పగా ఏముంది.. క్లాసిక్ అని చెప్పేంత గొప్ప కథ ఇది కాదు అంటున్నారు. సరిగ్గా మూడేళ్ల కిందట తెలుగులో సుమంత్ నటించిన మళ్ళీరావా సినిమా కథ కూడా ఇదే అంటూ ఆడియన్స్ కామెంట్ చేస్తున్నారు. ఎమోషనల్ కథ కావడంతో అక్కడక్కడ మ్యాజికల్ సన్నివేశాలున్నాయి కానీ సినిమా అంతా మ్యాజిక్ మాత్రం లేదు. తమిళనాట విజయ్ సేతుపతి, త్రిషకు ఉన్న ఫాలోయింగ్ ఈ సినిమాను క్లాసిక్ అయ్యేలా చేసింది. కానీ అలాంటి సబ్జెక్టును రీమేక్ చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమ్ కుమార్ ఈ విషయంలో విఫలం అయ్యాడని చెబుతున్నారు విశ్లేషకులు. ఏదేమైనా కూడా జాను ఒక మంచి సినిమానే కానీ గొప్ప సినిమా మాత్రం కాదు అంటున్నారు ఆడియన్స్.

More Related Stories