English   

సందీప్ కిషన్ A1 ఎక్స్‌ప్రెస్‌  షూట్ మొదలైంది

Sundeep Kishan
2019-11-05 15:27:52

నిను వీడ‌ని నీడ‌ను నేనే సినిమా హిట్ కొట్టి మళ్ళీ ఫాంలోకి వచ్చిన సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తున్న కొత్త చిత్రం `A1 ఎక్స్‌ప్రెస్‌`. నిన్న ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. డెన్నిస్ జీవ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ బ్యానర్ ల మీద టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెంలు ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక నిన్న జరిగిన లాంచింగ్ లో ప‌లువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

 ఇక ఈరోజు నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ కి కూడా వెళ్లనుందట ఈ సినిమా. హ‌కీ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న తొలి తెలుగు సినిమా కావడంతో పాటు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సందీప్ కిష‌న్ చేస్తున్న తొలి సినిమా కూడా ఇదే కావడంతో సినిమా మీద అంచనాలు నెలకొన్నాయి. హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కోసం ఆమె హాకీ ఆటలో శిక్షణ తీసుకుంటుందట. ఈ చిత్రంలో లావణ్య హాకీ ప్లేయర్ గా కనిపించనుందట. ఈ చిత్రం కోసమే ఈ భామ హాకీ లో శిక్షణ తీసుకుంటుందని అంటున్నారు.  
 

More Related Stories