English   

సందీప్ కిషన్ A1 ఎక్స్‌ప్రెస్ ట్రైలర్ టాక్ 

 Sundeep kishan
2021-01-26 20:45:04

సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కతున్న సినిమా "A1 ఎక్స్ప్రెస్". ఈ చిత్రానికి డెన్నిస్ జీవన్ దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమాలో లావణ్య త్రిపాఠి సందీప్ కిషన్ తో రొమాన్స్ చేయనుంది. ఈ సినిమా కోసం సందీప్ తన లుక్ మొత్తాన్ని మార్చుకున్నాడు. లాంగ్ హెయిర్ తో సిక్స్ ప్యాక్స్ బాడీతో సందీప్ కనిపిస్తున్నాడు. దానికోసం ఎంతో వర్కౌట్స్ చేశానని ఇదివరకు ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇక ఈ సినిమా ఓ తమిళ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి హిప్ హాప్ తమిజా సంగీతాన్ని అన్ధసితున్నాడు. 

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన "సింగిల్ కింగులం" అనే పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ట్రైలర్ లో ఎమోషనల్ సన్నివేశాలు కనిపిస్తున్నాయి. క్రీడాకారులపై బిసినెస్ మ్యాన్ ల ప్రభావం ఎలా ఉంటుందో సినిమాలో చుకొయించబోతున్నట్టు తెలుస్తోంది. లావణ్య త్రిపాఠి తో ఉన్న లవ్ సీన్ లు కూడా అలరించాయి. దాంతో సినిమాలో రొమాన్స్ కూడా కొదువ ఉండదని అర్థం అవుతోంది. ఇక ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ కన్ఫామ్ చేసింది.

More Related Stories