English   

సందీప్ కిష‌న్‌ A1 ఎక్స్ ప్రెస్ రివ్యూ

A1 Express
2021-03-05 13:22:30

ఇది వ‌ర‌కు ప్రేమ క‌థ‌ల‌తో అల‌రించిన సందీప్ కిష‌న్ మొద‌టిసారి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేసాడు అదే ఏ1 ఎక్స్ ప్రెస్‌. ఈ చిత్రంలో లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. సినిమా‌ను త‌మిళంలో మంచి విజ‌యం సాధించిన నాప్టే తునై అనే సినిమాకు రీమేక్ గా తెర‌కెక్కించారు. పేరుకు రీమేక్ అయినా సినిమాలో చాలా మ‌ర్పులు చేసారు.  సినిమా టీజ‌ర్ మ‌రియు ట్రైల‌ర్  ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకోగా శుక్ర‌వారం ఈ చిత్రం విడుద‌లై ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి హాకీ నేప‌థ్యంతో తెర‌కెక్కిన ఈ చిత్రం గోల్ కొట్టిందా..లేదా ఇప్పుడు చూద్దాం.

క‌థ :

సినిమాలో సందీప్ కిష‌న్ కు హాకీ క్రీడ అంటే చాలా ఇష్టం. అంతే కాకుండా హాకీనే త‌న కెరీర్ గా మ‌లుచుకోవాల‌ని క‌లలు కంటూ ఉంటాడు. హాకీలో రాణించి జాతీయ స్థాయి వ‌ర‌కు చేరుకుంటాడు. కానీ ఈ క్ర‌మంలో సందీప్ కు ఎదురైన కొన్ని ప‌రిస్థితుల వ‌ల్ల నిరాశ‌కు లోనౌతాడు. ఇక లైఫ్ లో త‌న‌కు స‌క్సెస్ దొరక‌ద‌ని భావించి లోక‌ల్ జ‌ట్టులో ఆడ‌టం మొద‌లు పెడ‌తాడు. అయితే ఈ క్ర‌మంలో సందీప్ ఫ్రాన్స్ వెళ్ళాల‌ని చాలా క‌ష్ట‌ప‌డుతుంటాడు. ఈస‌మ‌యంలోనే హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి ప‌రిచ‌యం అవుతుంది. ఆ ప‌రిచ‌యం కాస్తా ప్రేమగా మారుతుంది. లావ‌ణ్య తో ప్రేమ ద్వారా సందీప్ హాకీ కోచ్ గా మారిపోతాడు. కాగా క్రీడా కారులు ఆడుకునే హాకీ మైదానం పై కార్పొరేట్ క‌న్ను ప‌డుతుంది. దాంతో కార్పొరేట్ కంపెనీల నుండి మైదానం ను కాపాడుకోవ‌డానికి ఏం చేసాడు..మైదానాన్ని కాపాడాడా లేదా..కాపాడుకునే క్ర‌మంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుకున్నాడ‌న్న‌దే సినిమా క‌థ‌.

క‌థ‌నం :

ఈ సినిమాను త‌మిళంలో నాప్టేతునై ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు డెన్నిస్ జీవ‌న్ తెలుగులో గా తెర‌కెక్కించారు. అయితే తెలుగులో మాత్రం దాదాపు 50శాతం మార్పులు చేశాడు. ఇదిలా ఉండ‌గా మైదానాన్ని కాపాడుకునే నేప‌థ్యంలో ఇప్ప‌టికే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో సై సినిమా వ‌చ్చింది. కానీ తెలుగులో హాకీ నేప‌థ్యంలో సినిమా రావ‌డం ఇదే తొలిసారి. తెలుగులో క‌బ‌డ్డీ, క్రికెట్ నేప‌థ్యంలో చాలా సినిమాలు వ‌చ్చాయి కానీ. జాతీయ క్రీడ హాకీ నేప‌థ్యంలో సినిమా తీసి ద‌ర్శ‌కుడు మ‌న ఆట‌ను గుర్తు చేసాడు.ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ లోనే ప‌ట్టు సాధించింది. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ చిత్రానికి ప్ల‌స్ పాయింట్ అయ్యింది. అయితే హీరోయిన్ రొమాంటిక్ స‌న్నివేశాలు ఉండాలి కాబ‌ట్టి లావ‌ణ్య త్రిపాఠి ని సినిమాలో భాగం చేసిన‌ట్టు అనిపించింది. మొత్తానికి హాకీని తెర‌పై చూపించిందేకు ద‌ర్శ‌కుడు త‌న టాలెంట్ ను వాడేశాడు.

న‌టీన‌టుల ప‌ర్ఫామెన్స్ :

ఈ సినిమాలో హీరోగా న‌టించిన సందీప్ కిష‌న్ సినిమాను త‌న బుజాల పై మోసాడ‌నిపించింది. హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి త‌న లావ‌ణ్యంతో ఆక‌ట్టుకుంది. మిగ‌తా న‌టీన‌టులు రావ్‌ర‌మేష్ , ముర‌ళీశ‌ర్మ లు త‌మ పాత్ర‌ల‌కు  న్యాయం చేశారు. సినిమాలో కామెడీ ఫ‌ర్వాలేద‌నింపించింది. మొత్తంగా చూసుకుంటే తెలుగులో వ‌చ్చిన సినిమాల్లో హాకీ బ్యాక్ డ్రాప్ లో వ‌చ్చిన మొద‌టి సినిమా కావ‌డంతో తెలుగు ఆడియ‌న్స్ కొత్త‌గా ఫీల్ అయ్యే చాన్స్ ఉంది. ఈ సినిమాకు ప్రేక్ష‌కులు క‌నెక్ట్ అయితే సినిమా మంచి విజయం సాధించే అవ‌కాశం ఉంది. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే సందీప్ కిష‌న్ ఎ1 ఎక్క్ ప్రెస్ గోల్ కొట్టేలా క‌నిపిస్తుంది. 

More Related Stories