English   

ఆది ‘నీవెవరో’అంటున్నాడు

Aadhi-Neevevaro

రంగస్థలంతో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ యాక్టర్ ఆది. అంతకు ముందు హీరోగా ట్రై చేసి సరైన ‘మలుపు’ రాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు. ముందు సరైనోడులో విలన్ గా మెప్పించి తర్వాత అజ్ఙాతవాసిలో ఆకట్టుకున్నాడు. కానీ రంగస్థలంతో ఒక్కసారిగా ఆ బ్యాడీ ఇమేజ్ ను చెరిపేసుకున్నాడు. కట్ చేస్తే ఇప్పుడు ఆదికి అదిరిపోయే ఆఫర్స్ వస్తున్నాయి. అయితే ఈ సారి ఇక హీరోగానే అంటున్నాడు. ఆ క్రమంలో తాప్సీ, రితికా సింగ్ హీరోయిన్లుగా ఓ సినిమా మొదలైంది. లేటెస్ట్ గా ఆ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. ఆది కొత్త సినిమా టైటిల్ ‘నీవెవరో’.ఎమ్.వి.వి సినిమా, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి హరినాథ్ దర్శకుడు. ఈ టైటిల్ కోసం గత కొన్ని రోజులుగా ఊరిస్తున్నారు. ఫైనల్ గా నీవెవరో అనే టైటిల్ అనౌన్స్ చేశారు. ఇక గతంలో ఆది పినిశెట్టి, తాప్సీ కలిసి గుండెల్లో గోదారి సినిమాలో నటించారు. ఈ మూవీలో ఇద్దరి మధ్యా ఓ హాటైన ఇంటిమేట్ సీన్ కూడా ఉంటుంది. మళ్లీ ఇన్నాళ్లకు ఇద్దరూ  కలిసి నటిస్తున్నారు. అటు గురు తర్వాత తెలుగులో ఒక్క ఆఫర్ దక్కించుకోలేకపోయిన రితిక ఫైనల్ గా ఈ మూవీతో చాన్స్ కొట్టేసింది. దీంతోపాటు మరో సినిమా కూడా చేస్తున్నట్టు టాక్. ఆది మరోవైపు సమంత నిర్మిస్తోన్న కన్నడ రీమేక్ యూ టర్న్ లో కూడా కీలక పాత్ర చేస్తున్నాడు. ఒకవేళ ఈ రెండు సినిమాలూ హిట్ అయితే ఆదికి హీరోగా మళ్లీ మంచి రోజులు వస్తాయేమో.. 

More Related Stories